రూ.37 కోట్లు వెనక్కిచ్చిన అగ్రహీరో

సల్మాన్ ఖాన్. వరుసగా హిట్ లు ఇస్తున్న హీరో.. ఈ మద్య ఆయన హిందీలో తీసిన భజరంగీ భాయిజాన్ బాహుబలి1 సినిమాకంటే కూడా అత్యధిక వసూళ్లు సాధించింది. అలాంటి సల్మాన్ ఖాన్ తదుపరి తీసిన సినిమా ‘ట్యూబ్ లైట్ ’ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా ‘ట్యూబ్ లైట్’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అట్లర్ ప్లాప్ అయ్యింది. ఇండియా-చైనా సరిహద్దుల్లో జరిగిన ఓ ప్రేమ కథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకుడిగా మారి తీశారు.

ఈ సినిమాను కోట్లు పెట్టి కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ట్యూబ్ లైట్ సినిమా అతిపెద్ద ప్లాపుల్లో ఒకటిగా నిలిచింది. అత్యంత భారీనష్టాలు రావడంతో ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు తమను ఆదుకోవాలని సల్మాన్ ఖాన్ ను కోరారు. దీంతో వచ్చిన నష్టాన్ని లెక్కించి మొత్తం 37కోట్లను సల్మాన్ ఖాన్ వెనక్కి ఇచ్చేశాడట.. సల్మాన్ చూపిన ఈ చొరవకు బాలీవుడ్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

గతంలో రజినీకాంత్ కూడా తాను తీసిన బాబా సినిమా ప్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వాపస్ ఇచ్చి పేరుపొందగా.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా తన సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి 37 కోట్లు తిరిగి ఇచ్చేయడం సంచలనంగా మారింది.

To Top

Send this to a friend