సల్లూ భాయ్‌కి అంత సీన్‌ లేదు


బాలీవుడ్‌ సినిమాలకు సైతం సాధ్యం కాని రీతిలో ‘బాహుబలి’ చిత్రం కలెక్షన్స్‌ను సాధించిన విషయం తెల్సిందే. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రాబట్టలేని వసూళ్లు రాబట్టిన ‘బాహుబలి’ చిత్రాన్ని ట్యూబ్‌టైల్‌ క్రాస్‌ చేస్తుందనే నమ్మకంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు, సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ఉన్నారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సల్మాన్‌ ఖాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటున్నారు.

ఇండియాలో ‘బాహుబలి’ రికార్డులను క్రాస్‌ చేయాలి అంటే వెయ్యి కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. కాని ట్యూబ్‌లైట్‌కు ఆ స్థాయి లేదని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ట్యూబ్‌లైట్‌ వెయ్యి కోట్లను సాధించడం అనుమానం అని, అలాంటిది ‘బాహుబలి 2’ రికార్డును సల్మాన్‌ బ్రేక్‌ చేయడం అంటే సాధ్యం అయ్యే పని కాదు. ‘బాహుబలి 2’ చిత్రం మొత్తంగా 1700 కోట్ల వసూళ్లను సాధించింది. ఒక్క ఇండియాలోనే వెయ్య కోట్ల కు  పైగాసాధించి   నెం.1 స్థానంలో ఉంది.

సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘దంగల్‌’కు కూడా ఇండియాలో వెయ్యి కోట్లను సాధించలేక పోయింది. అలాంటిది సల్మాన్‌ ఖాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రం ఎలా సాధిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్యూబ్‌లైట్‌ చిత్రానికి సౌత్‌లో పెద్దగా ఆధరణ ఉంటుందనే నమ్మకం లేదు. కేవలం ఉత్తరాదిలో మరియు ఓవర్సీస్‌లో మాత్రమే సల్మాన్‌ఖాన్‌ సత్తా చాటాల్సి ఉంటుంది. అందుకే సల్మాన్‌ ఖాన్‌కు ‘బాహుబలి 2’ను క్రాస్‌ చేసేంత సీన్‌ లేదని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు.

To Top

Send this to a friend