ఫిదా బ్యూటీ ఇప్పుడు కాస్లీ..

ఫిదాలో అద్భుతంగా నటించిన సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట.. ఈ రెమ్యునరేషన్ చూసి నిర్మాతలు షాక్ అవుతున్నట్టు తెలిసింది. ఫిదాలో నటించినందుకు సాయి పల్లవికి కేవలం 25లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే నిర్మాత దిల్ రాజు ఇచ్చాడట..అప్పటికే మళయాళ ప్రేమమ్ సినిమా ద్వారా ఫేమస్ అయిన ఈమెకి ఫిదా కూడా హిట్ కావడంతో ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ను ఏకంగా 70లక్షలకు పెంచేసిందట..ఫిదాతో తెలుగు తెరను షేక్ చేసిన హీరోయిన్ సాయి పల్లవికి ఆఫర్లు క్యూ కడుతున్నాయట.. అది తెలంగాణ నేపథ్య కథ.. తీసింది ఆంధ్రా డైరెక్టర్.. హీరోయిన్ ఏమో మళయాళీ.. ఎక్కడా పోలిక లేకున్నా కానీ సినిమా మాత్రం బాగా వచ్చింది. రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది..

దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా ఓవర్సీర్ లో దుమ్మురేపుతోంది. ఫిదా సినిమా హిట్ కావడానికి ప్రధానంగా హీరోయిన సాయి పల్లవి తెలంగాణ యాస, భాష చెలకీ నటన.ఇప్పటికే ఈ సినిమా ఒక్క అమెరికాలోనే 10లక్షల డాలర్ల రికార్డు కలెక్షన్లు సాధించి ముందుకెళ్తోందని నిర్మాతలు ప్రకటించారు.

ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వేరే హీరోయన్ల అయితే కోటికి పైగా అడుగుతారని.. కానీ సాయి పల్లవి 70లక్షలే అడుగుతూ రీజనబుల్ అమౌంట్ ను డేట్స్ కోసం ఆఫర్ చేస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. 70లక్షలు పెట్టడానికి నిర్మాతలు వెనుకాడడం లేదని తెలుస్తోంది.

To Top

Send this to a friend