తెలుగులో బిజీ అవుతున్న సాయి పల్లవి

దర్శకుడు శేఖర్ కమ్ముల ద్వారా ఫిదా చిత్రం తో తెలుగు సినీ రంగానికి పరిచయమైన సాయి పల్లవి ఆ తరవాత ఎం సి ఏ చిత్రం తో మరో సక్సెస్ చవి చూసింది. కానీ ఆ తరవాత వచ్చిన కణం ,  పడి పడి లేచే మనసు వంటి చిత్రాలు సాయి పల్లవి కి విజయాన్ని అందివ్వలేక పోయాయి. దాంతో సాయి పల్లవి తన తదుపరి అడుగులు   ఆచి తూచి వేస్తోంది. ఆ క్రమంలో ఇపుడు చేయబోతున్న చిత్రాలన్నీ విభిన్నమైనవే…వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ చిత్రాన్ని…అక్కినేని నాగ చైతన్య హీరో గా వస్తున్న ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ మూవీగా రూపుదిద్దు  కొంటోంది. ఇక ఈ చిత్రం తో పాటు షూటింగ్ జరుపుకొంటున్న మరో చిత్రం విరాట పర్వం. దగ్గుబాటి రానా, నందితాదాస్ వంటి మేటి నటుల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రాబోతుంది. తన తోలి చిత్రం టోన్ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తుండటం సాయి పల్లవి కి బాగా కలిసి రానుంది. ఇక తాజాగా మరో చిత్రానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. నేను శైలజ, చిత్రలహరి వంటి విభిన్న చిత్రాలతో సక్సెస్ అందుకొన్న దర్శకుడు కిశోర్ తిరుమల త్వరలో తీయబోయే ఒక ప్రేమ కదా చిత్రానికి సాయి పల్లవి కథానాయిక కానుంది.

To Top

Send this to a friend