సాహో.. పులకేసి మహారాజా..


అహో.. ఏపీ సామ్రాజ్య దీశుడి కుమారుడు యువరాజు మాటల పటాసు తుస్సుమనేసరికి సోషల్ మీడియా ఆడిపోసుకుంటుందే.. దీన్ని ఎలా ఆపగలమని రాజు తలపట్టుకుంటున్నాడు.. ఇదే సమయంలో ప్రత్యర్థులకు ఇదే అవకాశంగా తోచి ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇంతకీ మన యువరాజు వారు మంత్రివర్యులుగా మారినా కూడా ఇంకా ప్రజల నాడి పట్టడం లేదబ్బా అని టీడీపీ నేతలు సమాలోచనల్లో పడ్డారు. యువరాజు భాషకౌషలం మెరుగుపడేందుకు తెలుగు మాస్టారును ఏర్పాటు చేయాలని  భవదీయ మహారాజును కోరుతున్నారు.

యువరాజుకు పిల్లనిచ్చిన మామ గారి రాజ్యంలో జనం తాగునీటి జపం చేస్తున్నారు. ఓ వైపు ఏమో యువరాజా వారు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ చెప్పేశారు. అలా చెప్పగానే ఆలస్యం.. మామ ఇలాకా హిందూపురంలో.. నాన్నగారి పుట్టిన భూమి కుప్పం రాజ్యంలో నీటి కష్టాలతో జనం రోడ్డెక్కారు. అంటే యువరాజా వారు మాట నిలబెట్టుకున్నట్టే లెక్కా.. తాగునీటి ఎద్దడి తెచ్చారు పక్కా..

దీనిపై ప్రతిపక్షాలు ఊరుకుంటాయా.. సెటైర్లకే సెటైర్లు వైసీపీ రోజా వారు యువరాజు ప్రతిభా పాఠవాలను అమరావతిలో విలేకరుల సమావేశం పెట్టి మరీ చురకలంటించేశారు. యువరాజా వారు లోకేష్ మహానుభావులు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ ప్రకటన చేయగానే.. మామ బాలక్రిష్ణ హిందుపురంలో అమలు చేసి చూపించారని రోజా నవ్వులు పూయించారు. లోకేష్ బాబు కామెడీ జబర్దస్త్ ను మించిపోయిందని స్పష్టం చేశారు. అందుకే ఏకీ పారేస్తున్న సోషల్ మీడియాను నియంత్రించేందుకు రాజా-యువరాజా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంతైనా మన పులకేసి యువరాజు ఇప్పటికైనా లోకజ్ఞానం కోసం ఏదైనా యజ్ఞం చేస్తే మంచిదేమో..

To Top

Send this to a friend