సాహో బాహుబలి: 10 కోట్ల వ్యూస్


యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ (10కోట్లు) దాటిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి రికార్డు సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషలను కలుపుకొని ఈ రికార్డును సాధించింది. ఇంత మంది చూసిన భారతీయ సినిమా ట్రైలర్ ఇదేనని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.

మార్చి 16న రిలీజ్ అయిన బాహుబలి ట్రైలర్ ను తొలి 24 గంటల్లోనే 5కోట్ల మంది వీక్షించడం రికార్డ్ అయ్యింది. ఇప్పుడు 10కోట్ల వ్యూస్ సాధించిన తొలి సినిమాగా నిలవడంతో దేశంలోనే రికార్డు బద్దలు కొట్టింది. బాహుబలి1 మిగిల్చిన రికార్డుల పరంపరతోనే రెండో సినిమాకు ఇంత హైప్ వచ్చింది. అదే సమయంలో నిర్మాతలు, దర్శకుడు ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లడం లో విభిన్న పంథాలు ఎంచుకున్నారు. పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాను విస్తృతంగా వాడారు. దీంతో ప్రతి ఒక్కరికి బాహుబలి చేరువైంది.

సినిమాలో విషయం ఉంది కాబట్టే ఈరేంజ్ లో బాహుబలిపై ఆసక్తి నెలకొంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది రెండో భాగంలోనూ మరింత సస్పెన్స్ లో పెట్టారు. దీంతో అసలు సినిమాలో ఏముందనే ఆసక్తి నెలకొంది. ట్రైలర్ లో సీన్లు గ్రాఫిక్స్ అద్భుతంగా వచ్చింది. మొత్తం కథ బాహుబలి2లోనే ఉండడం కూడా సినిమాకు క్రేజ్ రావడానికి కారణమైంది.

యూట్యూబ్ లో ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ వచ్చిన చిత్రాలు..
1) బాహుబలి2 హిందీ ట్రైలర్ :42.35 మిలియన్ వ్యూస్
2) బాహుబలి2 తెలుగు ట్రైలర్ : 39.95 మిలియన్
3) డీజే దువ్వాడ జగన్నాథమ్: 12.12 మిలియన్
4) కాటమరాయుడు టీజర్ : 11.50 మిలియన్
5) ఖైదీనంబర్ 150 : 7.86 మిలియన్
6) ధృవ ట్రైలర్ :7.83 మిలియన్
7) గౌతమి పుత్ర శాతకర్ణి : 7.79 మిలియన్

To Top

Send this to a friend