అక్కినేని వారి ఇంట విషాదం..

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు అనారోగ్య కారణాల రీత్య నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. గత రెండు సంవత్సరాలుగా కూడా ఈయన శ్వాస సంబంధించిన మరియు గుండెకు సంబంధించిన వ్యాదితో బాధ పడుతున్నారు. అప్పటి నుండి ప్రముఖ హాస్పిటల్స్‌లో సత్యభూషణ రావుకు చికిత్స ఇప్పిస్తున్నారు. కాని ఆయన చికిత్సకు తేరుకోలేక పోయాడు. ఎంత ప్రయత్నించినా కూడా నేడు ఉదయం తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయాడు.

తెలుగు సినిమా పరిశ్రమ మొదటి తరం నిర్మాతల్లో ఒక్కరైన అనుమోలు వెంకట సుబ్బారావు తనయుడు అయిన అనుమోలు సత్యభూషణ రావు గారు అక్కినేని నాగేశ్వరరావు రెండవ కుమార్తె అయిన నాగ సుశీలను వివాహం చేసుకున్నారు. మొదట ఆమెతో విభేదాలు వచ్చినా ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉంటున్నారు. కొడుకును హీరోను చేసేందుకు సత్యభూషణ రావు ప్రయత్నాలు చేశాడు.

అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండి కూడా సుశాంత్‌ సక్సెస్‌లను దక్కించుకోలేక పోయాడు. దాంతో గత కొన్నాళ్లుగా సుశాంత్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తనయుడి హీరోగా పేరు తెచ్చుకుంటే చూడాలని ఆశించిన సత్యభూషణ రావు కోరిక తీరకుండానే మృతి చెందారు. సత్యభూషణరావు మృతితో అక్కినేని కుటుంబం శోఖసంద్రంలో మునిగింది. ఆయనకు సినీ ప్రముఖులు తమ శ్రద్దాంజలి ఘటించారు.

To Top

Send this to a friend