‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ కోసం సిద్దం అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకు అమెరికాలో పూర్తి విశ్రాంతి తీసుకున్న ప్రభాస్ తాజాగా ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ‘సాహో’ చిత్రం షూటింగ్లో పాల్గొనడం లేదు. ప్రస్తుతం ‘సాహో’ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో లేకుండానే కొన్ని ముఖ్య సన్నిశాలను దర్శకుడు సుజీత్ జరుపుతున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ అతి త్వరలోనే పాల్గొంటాడని తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం కొత్త లుక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అనుకున్నట్లుగా లుక్‌తో రెడీ అవ్వగానే దర్శకుడు ప్రభాస్‌తో అసలైన షూటింగ్‌ను మొదలు పెట్టే అవకాశాలున్నాయి. మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ‘సాహో’ చిత్రం టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాను వచ్చే సంవత్సరంలో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. హీరోయిన్గా అనుష్క నటించే అవకాశాలున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘బాహుబలి’తో బాలీవుడ్ రేంజ్లో గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ఈ సినిమాను బాలీవుడ్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు.
