సాహో ప్రభాస్


బాహుబలి చిత్రానికి గాను 5 ఏళ్లుగా కష్టపడ్డ ప్రభాస్ తన తరువాతి చిత్రాన్ని మాత్రం త్వరగానే పట్టాలెక్కిస్తున్నాడు. రన్ రాజా రన్ చిత్రంతో హిట్ కొట్టిన సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సాహో అనే టైటిల్ ను నిర్ణయించారు.

బాహుబలితో ప్రభాస్ స్టామినా ప్రపంచవ్యాప్తంగా తెలియవచ్చింది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీల్లో ప్రభాస్ కు మార్కెట్ పెరిగింది. ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా ఓ టెక్నాలజీ బేస్ డ్ కథతో కొత్త చిత్రాన్ని తీస్తున్నారు. యువ దర్శకుడు సుజిత్ కు ఇది రెండో చిత్రమే అయినా.. తీసిన విధానం హాలీవుడ్ స్టైల్లో ఉంది.

బాహుబలి రిలీజ్ తో పాటు మధ్యలో సాహో టీజర్ ను విడుదల చేశారు. ముఖంపై రక్తం మరకలను తుడుచుకుంటూ వినపించే డైలాగ్ లో ప్రభాస్ వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉంటుంది. చివర్లో ఇట్స్ షో టైం అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

To Top

Send this to a friend