ఎస్.బీ.ఐ: మినిమమ్ బ్యాలెన్స్

దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్.బీ.ఐ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అన్న నిబంధనలపై సడలింపునిచ్చింది. అది పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చింది.. గతంలో ఏప్రిల్ 1 నుంచి ఖాతాల్లో కనీస మొత్తంలో సొమ్ములేకుంటే చార్జీల మోత తప్పదని ఎస్.బీ.ఐ హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఈ విధానాన్ని ఈనెల 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది కూడా. అయితే ఇప్పుడు చాలా మందికి మినహాయింపునిచ్చింది. ట్విట్టర్ ద్వారా ఎస్.బీ.ఐ ఈ వివరణ ఇచ్చింది.

ఎస్.బీ.ఐ ఖాతాదారుల్లో సామాన్యుల చిన్న తరహా సేవింగ్స్ ఖాతాలు.. బేసిక్ సేవింగ్స్ ఖాతాలతో పాటు.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల నుంచి మినహాయించినట్టు ప్రకటించింది. కార్పొరేట్ సేలరీ ప్యాకేజ్ ఖాతాలకు కూడా ఇందులోంచి మినహాయింపు ఉన్నట్టు తెలిపింది.

ఈ చర్య వేలాది మంది ఎస్.బీ.ఐ ఖాతాదారులకు ఊరటనిచ్చింది. సామాన్యులు, ఉద్యోగులకు మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలన్న దానిపై గొప్ప ఊరట లభించింది.ఏప్రిల్ 1 నుంచి ఎస్.బీ.ఐ ఖాతాల్లో మెట్రో నగరాల్లో రూ5వేల బ్యాలెన్స్, నగరాల్లో 3 వేలు, పట్టణాల్లో 2 వేలు.. గ్రామాల్లోని శాఖల్లో 1000 నగదు తప్పనిసరిగా ఉండాల్సిందే..ఇప్పుడు నిబంధనలు సడలించడంతో ఎస్.బీ.ఐ ఖాతాదారులకు ఊరట లభించింది.

To Top

Send this to a friend