పోరి కోసం 13 లక్షలు..

ప్రేమ గుడ్డిది.. చెవిటిది.. మూగది.. ఇంకా ఏది ఉంటే అది.. ప్రేమికులకు కన్ను మిన్ను డబ్బు కానరాదంటారు.. ఇక్కడో 17 ఏళ్ల విశాఖ పోరడికి కూడా అలానే ఏం ఏర్పడలేదు. ప్రేమ మత్తులో కోల్ కతాకు చెందిన ఓ మాయ పోరికి ఏకంగా 13 లక్షలు పంపించాడు. ఈ విషయం ఆయన నాన్నకు తెలిసి లబోదిబో మన్నాడు . పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పోరడు చేసిన పనికి వాళ్ల నాన్న నిండా మునిగాడు.

విశాఖపట్నం రైల్వే కాలనీకి చెందిన సుభాష్ చంద్రదాస్ (60) ఇటీవల రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు దాదాపు 40 లక్షల పదవీ విరమణ డబ్బు వచ్చింది. ఆ డబ్బును స్థానిక విశాఖలోని ఎస్.బీ.ఐ ఖాతాలో జమచేశాడు. ఈ విషయం ఆయన కొడుకుకు తెలుసు. నాన్నకు తెలియకుండా ఆయన ఖాతాలోంచి డబ్బును కొడుకు సదురు ప్రేమించిన అమ్మాయికి పంపించేశాడు.

ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 13 సార్లు సుభాష్ చంద్రదాస్ కొడుకు కోల్ కతాలోని అమ్మాయికి దాదాపు 13 లక్షల డబ్బును పంపించాడు. కోల్ కత అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిన యువకుడు.. ఓ సారి అమ్మాయి 40 వేలు అర్జెంట్ గా కావాలంటే నాన్న ఏటీఎం తీసుకొని డబ్బులు డ్రా చేసి పంపించాడు. అలా ఇంకా కావాలంటే నాన్న ఏటీఎం వాడుతూ, ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా దాదాపు 13 లక్షలు యువతి ఖాతాలో వేశాడు ఆ యువకుడు..

ఇక తండ్రికి మెసేజ్ సర్వీస్ ఉన్నా ఈ డబ్బులు పోయిన విషయాన్ని ఆయన చూసుకోలేదు. సెల్ కు మెసేజ్ వచ్చినా చూసుకోని తండ్రి చివరకు రాత్రి ఫోన్ చూసుకునే సరికి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే పోలీసులను సంప్రదించాడు. వారు విచారించగా.. రైల్వే ఉద్యోగి కొడుకే ఇలా డబ్బు పంపించాడని తెలిసింది. దీంతో ఎక్కడికి ఎవరికి పంపారనే దానిపై విచారణ జరుపుతున్నారు. సదురు మాయ లేడి ఎవరు , ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

To Top

Send this to a friend