రూపే ఏటీఎం కార్డుంటే రూ.2 లక్షల నజరానా

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డును తీసుకుంటున్నారు. నోట్ల రద్దు తర్వాత జనాలందరూ బ్యాంకుల్లో డబ్బులు వేసి ట్రాన్స్ సాక్షన్ లు చేసేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం డిజిటిల్ లావాదేవీలకు తెరతీయడంతో ఇప్పుడు చేతిలో క్యాష్ లేకున్నా కార్డు ఉంటే చాలనే పరిస్థితి నెలకొంది.

చిన్న చిన్న దుకాణాల నుంచి బడా వ్యాపారాల దాకా అంతటా కార్డు సిస్టమ్ వచ్చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జనాలు ఏటీఎం కార్డులను విరివిగా తీసుకొని వినియోగిస్తున్నారు..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏటీఎం వినియోగదారులకు మరో తీపి కబురును అందించింది. ఏటీఎంలలో రూపే కార్డు ఉన్న వినియోగదారులకు ఇన్సూరెన్స్ ను కేంద్రం వర్తింప చేసింది. ఈ విషయంలో వీసా, మాస్ట్రో కార్డు వినియోగదారులకు ఆ చాన్స్ ను కేంద్రం ఇవ్వలేదు.

అన్ని బ్యాంకుల రూపే ఏటీఎం, డెబిట్ కార్డుదారులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాదారుల్లో ఎవరైతే రూపే కార్డు కలిగియున్నారో వారికి కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తామని ప్రకటించింది. ప్రమాదంలో మరణించినా.. శాశ్వత వైకల్యం పొందిన వారికి కూడా ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రమాదం జరిగిన 90 రోజుల్లోగా ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకుంటే నామినీకి లేదా వారి వారసులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా ఈ 2 లక్షల ప్రీమియం ను చెల్లిస్తుంది.. ఇప్పటికైనా వివిధ బ్యాంకుల్లో వీసా, మాస్ట్రో కార్డు ఉన్న వినియోగదారులు దేశీయ పేమెంట్ సంస్థ రూపే ఏటీఎం కార్డులనే తీసుకోండి.. రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను పొందండి.. త్వరపడండి..

To Top

Send this to a friend