నారాతో మెగా.. ఇది పుకారే

నారా రోహిత్‌ సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నది లేదు. అయినా కూడా మరో రెండు మూడు సినిమాలను ఈయన కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే రెండు సినిమాలను చేస్తున్నాడు.

తాజాగా కమిట్‌ అయిన ఒక సినిమాలో హీరోయిన్‌గా మెగా వారసురాలు నిహారిక నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. ‘సావిత్రి’ చిత్రాన్ని తెరకెక్కించి చేతులు కాల్చుకున్న దర్శకుడు పవన్‌ సాదినేని తాజాగా నారా రోహిత్‌తో మరో సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా నిహారికను అనుకున్నారు. ఈ విషయమై స్వయంగా దర్శకుడు పవన్‌ సాదినేని స్పందిస్తూ వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు.

నారా రోహిత్‌తో సినిమా ఇంకా చర్చల దశలో ఉందని, త్వరలోనే ఆ సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్‌గా నిహారికను తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, ఆ వార్తలు ఎలా వచ్చాయో తనకు కూడా అర్థం కావడం లేదు అంటూ ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. నారా, మెగా కాంబో వర్కౌట్‌ అయ్యే ఛాన్సే లేదని మొదటి నుండే కొందరు భావిస్తూ వస్తున్నారు. తాజాగా క్లారిటీ వచ్చింది.

To Top

Send this to a friend