హీరోయిన్ రేప్,రూ.1.5 కోట్లు సుపారీ..

ఓ హీరో, హీరోయిన్ వ్యక్తిగత లొల్లి చివరకు పగ సాధించుకునే దాకా వెళ్లింది.. తన వ్యక్తిగత జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి కాపురంలో చిచ్చుపెట్టిందుకు ఓ అగ్రహీరో.. ఏకంగా హీరోయిన్ నే రేపించాడని విచారణలో వెల్లడైంది. విస్తుగొలిపే ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. మళయాల నటి భావనను అప్పట్లో ఆమె షూటింగ్ నుంచి వస్తుండగా కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి రేప్ చేశారు. దీనిపై పోలీసులకు ఆనాడే ఆమె ఫిర్యాదు చేసింది. ఆకేసులో విచారించగా.. మళయాల అగ్రనటుడు దిలీపే 1.5 కోట్లు సుపారీ ఇచ్చి దుండగులతో నటి భావనను రేప్ చేయించాడని విచారణలో వెల్లడి కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

నటి భావన, హీరో దిలీప్ ల మధ్య విభేదాలకు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడమే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నటి భావన.. హీరో దిలీప్ ఎఫైర్ లను ఆయన భార్యకు చెప్పడమే ఆమె తప్పు అయిపోయింది. అసలు విషయానికి వస్తే.. 2013లో మళయాల అగ్రహీరో దిలీప్, నటి భావన కలిసి నటించారు. ఈ సందర్భంగా దిలీప్ .. కావ్య మాధవన్ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావనకు తెలిసింది. ఈ విషయాన్ని భావన.. దిలీప్ భార్య మంజు వారియర్ కు చెప్పింది. దీంతో భర్త దిలీప్ నుంచి విడాకులు తీసుకుంది మంజు. మేం ఇద్దరి విడిపోవడానికి కారణం హీరోయిన్ భావన అని కసి పెంచుకున్న దిలీప్.. అప్పటి నుంచి భావనపై పగతీర్చుకోవడానికి ప్లాన్ చేశారు.

నటి భావనపై ప్రతిీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసిన దిలీప్ ఇందుకోసం ఓ ముఠాకు రూ. 1.5 కోట్లు సుపారీ ఇచ్చి భావనను రేప్ చేయాలని నగ్న వీడియోలను యూట్యూబ్ లో పెట్టాలని కోరారు. సుపారీ తీసుకున్న దుండగులు అలానే చేసి భావనపై అత్యాచారం చేశారు. అనంతరం పోలీసుకు భావన ఫిర్యాదు చేయడం.. పోలీసులు తీగ లాగితే మళయాల అగ్రనటుడు దిలీప్ ఇదంతా చేయించాడని తేలడంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా షాక్ కు గురయ్యింది..

To Top

Send this to a friend