రోజా చెప్పిన పాయింట్ తో చంద్రబాబు జైలుకు..


తెలంగాణలో భూదందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ, అదే ఏపీలో విశాఖ భూ కుంభకోణంపై ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబును డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణం విలువ 4 లక్షల కోట్లని ఇందులో మంత్రులు, నారాలోకేష్, సీఎం చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు.

ఈ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపితే దొరికిపోతామనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్ చేత తూతూ మంత్రం విచారణ జరిపిస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ, సిట్ లు ఏపీ సీఎం చంద్రబాబు ఏదీ చెబితే అదే నివేదిక ఇస్తారని.. దీని వల్ల ఉపయోగం లేదని రోజా మండిపడ్డారు.

నిజంగా సీబీఐ చేత విచారణ జరిపిస్తే ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లు జైల్లో జీవితాంతం శిక్ష అనుభవించే కుట్ర కోణం వెలుగుచూస్తుందని రోజా ఆరోపించారు. ఆ విషయం తెలుసుకనుక విశాఖ భూ కుంభకోణం వెలుగురాకుండా పోలీసుల చేత తొక్కించేస్తున్నారని రోజా మండిపడ్డారు.

To Top

Send this to a friend