జబర్దస్త్ నుంచి వైదొలుగుతున్న రోజా

జబర్దస్త్ షో… ఎంత కామెడీ పంచుతుందో.. అంతే కాంట్రవర్సీని ఈ మధ్య మోసుకొస్తోంది. జబర్దస్త్ షో ట్రాక్ తప్పిందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. బూతు పురాణం స్కిట్ లలో తాండవిస్తోంది. రొమాంటిక్ , బూతు స్కిట్ లు ఎక్కువైపోయాయి. ఇంటా బయటా తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని కోర్టుల్లో కొన్ని సామాజికవర్గాల వారు కేసులు పెడుతున్నారు. రోజా, నాగబాబులపై కూడా కేసులు నమోదయ్యాయి. బూతు పురాణం అంటూ అందరూ విమర్శిస్తుండడంతో రోజా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం..

దీంతో రియలైజ్ అయిన రోజా తన రాజకీయ జీవితానికి జబర్దస్త్ ఇబ్బందికరంగా మారుతుండడంతో తాను జబర్దస్త్ కామెడీ షోలో నటించడం మానేస్తానని TV9తో ఈరోజు స్పష్టం చేసింది. అయితే జబర్ధస్త్ మాత్రం హెల్దీ కామెడీ షో అని.. తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలన్నీ ఆ షోను విపరీతంగా ఆదరిస్తున్నాయని రోజా చెప్పింది. రాజకీయాల్లో ఉండడం.. వచ్చే 2019 ఎన్నికల్లో తన వల్ల వైసీపీ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు జబర్దస్త్ షో నుంచి వైదొలుగుతున్నట్టు రోజా ప్రకటించారు.

జగన్ ఇప్పటికే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వచ్చేసారి ఎన్నికల్లో వైసీపీ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యేగా రోజా కూడా జగన్ వెంట నడవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండేళ్లు ప్రజాజీవనంలో ఉండేందుకు వీలుగా రోజా జబర్దస్త్ షోకు మంగళం పాడేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం.

To Top

Send this to a friend