ప్రాణమున్నంత వరకు వైసీపీలోనే..

 

 

‘రోజా బయటకు వచ్చారు. తాను పనికిమాలిన టీడీపీలోకి, తలాతోకలేని జనసేనలోకి వెళ్తున్నానని.. కొంతమంది నాపై పనికిమాలిన వార్తలు రాస్తున్నారు.. నా ప్రాణమున్నంత వరకు వైఎస్సీఆర్ సీపీలోనే ఉంటానని..’ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.

చంద్రబాబు అండ్ ఆయన అనుకూల మీడియా కావాలనే తాను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను జగన్ నాయకత్వంలోనే వైసీపీలో కడవరకూ కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు రోజా ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లను ఏకీపారేశారు..

*తాగుబోతుల పాలనీ అది..
‘ఏపీలో జనాలు మంచినీల్లు లేక అల్లాడుతున్నారు. మరోవైపు కొత్త మద్యం పాలసీ తెచ్చి చంద్రబాబు మంత్రులు వందలకోట్లు వెనకేసుకుంటున్నారు. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం చంద్రబాబు, లోకేష్ లు వాటాలేసుకుంటున్నారు. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉన్నారా..? తాగుబోతులంతా కూర్చొని మద్యం పాలసీ తెచ్చారని’ టీడీపీ నేతలపై రోజా నిప్పులు కురిపించారు.

* సింహం ముందు పంది తొడకొట్టినట్టు..
లోకేష్ కు జగన్ ను విమర్శించే స్థాయి లేదని.. సింహం ముందు పంది తొడగొట్టినట్టు లోకేష్ వాగుడు ఉందని రోజా విమర్శించారు. అసలు లోకేష్ కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదని మండిపడ్డారు. జాతీయజెండాకు వందనం కూడా ఎలా చేయాలో లోకేష్ కు తెలియదని రోజా మండిపడ్డారు.

To Top

Send this to a friend