ఆసక్తి కలిగిస్తున్న లీక్డ్‌ పిక్స్‌

సౌత్‌లో దిగ్గజ దర్శకుడు రాజమౌళి. ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించిన శంకర్‌ ప్రస్తుతం ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ‘రోబో’కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఒక ముఖ్య పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై మొదటి నుండి కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన రెండు స్టిల్స్‌ లీక్‌ అయ్యాయి.

‘రోబో’ చిత్రంలో రజినీకాంత్‌ సాదారణ వ్యక్తిగా మరియు రోబోగా నటించాడు. మళ్లీ ఇప్పుడు ‘2.0’ చిత్రంలో కూడా రజినీకాంత్‌ రోబో తరహాలో కనిపించబోతున్నాడు. రజినీకాంత్‌తో పాటు అమీ జాక్సన్‌ కూడా రోబోనే అని లీక్‌ అయిన పిక్స్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ రోబో అని తేలిపోయింది. ఈ ముగ్గురు కూడా రోబోుగా కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తుతుంది. ఈ సంవత్సరం చివర్లో సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 2500 కోట్ల టార్గెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

To Top

Send this to a friend