బాహుబలి చరిత్రను తిరగరాయబోతోందా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ తో శంకర్ తీసిన రోబో సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా తీసిన రోబో2 సంచలనాలు రేపుతోంది. బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఇందులో విలన్ గా నటిస్తుండడంతో ఇటు దక్షిణాది భాషలతో పాటు హిందీలో రోబో2కు పిచ్చ క్రేజ్ ఏర్పడింది. అంతే స్థాయిలో మార్కెట్ కూడా జరుగుతోంది.

తాజాగా రోబో2 సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే స్థాయిలో జరుగుతోందని సమాచారం. శంకర్ దర్శకత్వం, రజినీకాంత్ హీరో కావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా చాలా ఏరియాల్లో భారీ రేట్లకు అమ్ముడుపోతోందట.. తెలుగు రాష్ట్రాల్లో రోబో2 డిస్ట్రి బ్యూషన్ రైట్స్ ను గ్లోబల్ సినిమాస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్ హెడ్ రాజుమహాలింగం ద్వారా ట్విట్టర్ లో ప్రకటించారు. అయితే ఎంత మొత్తానికి అనేది తెలియరాలేదు. ఈ మొత్తం టాలీవుడ్ సినిమాల్లోనే అత్యధిక రేటు అని.. ఇదో రికార్డు అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రోబో1 అప్పట్లో రూ. 32 కోట్లు తెలుగు లో వసూలు చేసింది. ఇదే రోబో హిందీ శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూపు 110 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ లెక్కన రోబో2కు అంతకుమించి కొనుగోలు ఖాయంగా కనిపిస్తోంది. రోబో2కు వస్తున్న హైప్ చూస్తే ఇది బాహుబలి వసూళ్లను మించిపోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అగ్రదర్శకుడు శంకర్ తీసిన సినిమాలన్నీ కళాఖండాలే.. తను తీయబోయే సినిమాలో ఖచ్చితంగా ఒక ప్రజా ఉపయోగ మేసేజ్ పెట్టడం.. దాంతో పాటు కమర్సియల్ హంగులు అద్ది హిట్ కొట్టడం చేస్తుంటాడు. ఆయన తొలిసినిమా జెంటిల్ మ్యాన్ నుంచి మొదలుపెడితే ఇప్పటి ‘ఐ’ సినిమా వరకు ఆయన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. కానీ చివరలో తీసిన ‘ఐ’ సినిమా మాత్రం కొంచెం నెగిటెవ్ టాక్ తెచ్చుకుంది. తన జీవితంలోనే ఇది పెద్ద డిజాస్టర్ అనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తన తరువాతి సినిమాను కసితో తీశాడు. అదే రోబో2. ఇప్పుడు ఈ సినిమాకు భారీ మార్కెట్ జరుగుతుండడంతో బాహుబలి రికార్డులు కొట్టుకుపోవడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

To Top

Send this to a friend