కుంబ్లే నువ్ హెడ్ మాస్టర్ కాదు.. కోచ్ వి.. గుర్తుంచుకో..

అదేమీ స్కూలు కాదు.. బెత్తం పట్టుకొని వేలు పెట్టి రాయించడానికి.. వారేమీ చిన్న పిల్లలు కాదు క్రమశిక్షణ అంటూ గోడ కూర్చీ వేయించడానికి.. అందరూ అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లే.. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా , అరవీర భయంకర బౌలర్లనైనా సరే చెడుగుడు ఆడించేవారు.. అంతటి భారత క్రికెటర్లను స్కూలు పిల్లలుగా ట్రీట్ చేస్తూ క్రమశిక్షణ పేరుతో బెదరగొడుతున్న భారత క్రికెట్ జట్టు కోచ్ కుంబ్లేకు కష్టకాలం వచ్చింది..

భారత కెప్టెన్ కోహ్లీ సహా సీనియర్ క్రికెటర్లందరూ కుంబ్లేపై అసంతృప్తిగా ఉన్నారు. భారత్ జట్టు కోచ్ గా కుంబ్లే వ్యవహారశైలి హెడ్ మాస్టర్ లో ఉందని.. తమను స్వేచ్చగా ఉండనివ్వడం లేరని.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం కుంబ్లే వల్ల చెడిపోతోందని సీనియర్ క్రికెటర్లందరూ బీసీసీఐ ఫిర్యాదు చేయడం తెలిసిందే..ఇది భారత్ క్రికెట్ లో సంచలనమైంది. అందుకే మరో ఏడాది వరకు కుంబ్లే కోచ్ గా ఉండాల్సి ఉన్నా ఆయనను సాగనంపేందుకు బీసీసీఐ కోచ్ ప్రకటన జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించడం సంచలనంగా మారింది..

చేసుకున్నోల్లకు చేసుకున్నంత.. ప్రపంచంలోనే మేటి క్రికెటర్లయిన విరాట్ కోహ్లీ, యువరాజ్ ,ధోని, రోహిత్, రహానే, ధావన్ లాంటి ఎంతో మందిని స్కూలు పిల్లల్లా ట్రీట్ చేస్తూ వారి స్వేచ్ఛను హరిస్తూ క్రమశిక్షణ పేరుతో కట్టుబాట్లు పెట్టిన కుంబ్లే ను కొనసాగించడం కష్టమని బీసీసీఐ వర్గాలు తాజాగా తేల్చాయి. అందుకే కొత్త కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించాయి.. ఈ రేసులో ప్రధానంగా కోచ్ టామ్ మూడీ ముందున్నారు. వీరేంద్రసెహ్వాగ్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో కుంబ్లేను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది..

To Top

Send this to a friend