ఘరానా మోసగాడిని పట్టించిన రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. కేసీఆర్ దెబ్బకు అప్పటినుంచి ఫోన్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలన్నింటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.. ఎక్కడ దొరక్కుండా ఫోన్ ట్యాప్ కాకుండా చూసుకుంటున్నాడట.. అయితే కేసీఆర్ దెబ్బకు కుదేలైన రేవంత్ కు మరో సారి అలాంటి ట్విస్ట్ ఎదురైంది. కానీ ఈసారి రేవంత్ ఏకంగా తనకు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తినే కటకటాలకు పంపి షాకిచ్చాడు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ… టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి ఫోన్ చేశాడట.. ప్రధాన మంత్రి ఎంప్లాయ్ మెంట్ గ్యారెంటీ పథకం కింద కేంద్రం నుంచి భారీ మొత్తంలో నిధులు వచ్చాయని .. తాను కేంద్రంలో అధికారిని అని నమ్మించాడు. మీ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇప్పిస్తానని.. మీరు అందుకోసం లక్షా 25 వేలు డిపాజిట్ చేయాలని ఫోన్లో రేవంత్ రెడ్డికి నమ్మించాడు. అలా చేస్తే రెండు కోట్ల కేంద్రం నిధులు మీ నియోజకవర్గానికి కేటాయిస్తానని చెప్పాడు.

దీనిపై అనుమానం వచ్చిన రేవంత్ రెడ్డి ఈ ఘరానా మోసగాడిని పట్టించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. అతడిని డబ్బులిస్తానని.. ఆలేరుకు రప్పించి అక్కడ పకడ్బందీగా జూబ్లీహిల్స్ పోలీసులతో పట్టించాడు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా బాలాజీ ఇలాగే ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి మోసాలు చేసినట్టు విచారణ వెల్లడి కావడం గమనార్హం.

To Top

Send this to a friend