జియో ఫీచర్ ఫోన్ డెలివరీ తేదీ మార్పు.

జియో ఫీచర్ ఫోన్లకు జనం ఎగబడ్డారు. దాదాపు 60 లక్షల మంది ఈ ఫోన్ కోసం బుకింగ్ చేసుకున్నారు. బుకింగ్ చేసుకున్న 60 లక్షల మంది కస్టమర్లకు విడతలవారీగా ఫోన్లను అందిస్తామని జియో తెలిపింది. సెప్టెంబర్ 25నుంచి ఈ ఫోన్లను బుక్ చేసుకున్న వినియోగదారులకు అందజేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 

ముందు అనుకున్న ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలోనే ఫోన్లను అందజేయాలని అనుకున్నా సరఫరాలో జాప్యం వల్ల ఇప్పుడు తేదీని 25కు మార్చారు.  ఈ 60 లక్షల ఫోన్లు వినియోగదారులకు సరఫరా చేశాకే మరోసారి ప్రీ బుకింగ్స్ ను చేపట్టున్నట్టు కంపెనీ ప్రకటించింది. జియో ఫోన్లకు ఇప్పటికీ క్రేజ్ నెలకొంది.  ఆగస్టు 24 గురువారం సాయంత్రం 5 గంటలనుంచి మొదలైన ఈ బుక్సింగ్స్ లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ప్రీ బుకింగ్స్ కోసం జనం ఎగబడ్డారు.  

వచ్చే నెలలో మరోసా ఆన్ లైన్ లో .. మైజియో యాప్ తో పాటు జియో.డాట్ కామ్ ద్వారా ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.. ప్రీ బుకింగ్స్ ఇంకా పోటెత్తడంతో జియో కంపెనీ తాత్కాలికంగా బుకింగ్స్ ను ఆపివేసింది. మరోసారి దసరా తర్వాత బుకింగ్స్ ను ఆపేస్తున్నట్టు తెలిపింది.  

To Top

Send this to a friend