10వేల రెట్ల లాభాలు.. ప్రజలకు బహుమానం..

ఒక కోటి, రెండు కోట్లు లాభాలొస్తేనే మనం ఎగిరి గంతేస్తాం. బాప్ రే ఏం బిజినెస్ చేస్తున్నాడురా అని అనుకుంటాం కానీ.. ఓ కంపెనీ చిన్నగా 1977లో మొదలై ఇప్పడు 3.3లక్షల కోట్లకు చేరిందంటే మాటలా..? ఇన్నేళ్లలో 10వేల రెట్ల లాభాలు చవిచూసిందంటే నమ్మశక్యంగా లేదా.? కానీ నిజం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కళ్లు చెదిరే లాభాలు చవిచూసింది. ఈ లాభాలు చూసి రిలయన్స్ అధినేత దేశప్రజలకు కృతజ్ఞతగా ఓ బహుమానం ప్రకటించారు. అందరూ ఊహించినట్టుగా రిలయన్స్‌ అధినేత సంచలన ప్రకటన చేశారు. జియో ఫోన్‌ భారతీయులందరికీ పూర్తిగా ఉచితమని రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో ముకేశ్‌ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఫీచర్‌ ఫోన్‌ లాంచ్‌ చేశామన్నారు. ఇండియాస్‌ ఇంటిలిజెంట్‌ ఫోన్‌ అంటూ అంబానీ వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఉచిత వాయస్‌ కాల్స్‌, ఉచిత డేటా అంటూ సునామీ సృష్టించిన జియో ఇపుడిక జియో ఫోన్‌ఉచితమంటూ ప్రత్యర్థులు బాంబులు పేల్చింది. దీన్ని నెలకు 153తో రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా కాల్స్, డేటా, ఎస్.ఎం.ఎస్ ఫ్రీ గా చేసుకోవచ్చని తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం) హైలైట్స్

-ఆర్ఐఎల్ ఐపీఓకు వచ్చిన తర్వాత ఇది 40వ సంవత్సరం
-1977లో రూ. 33 కోట్ల టర్నోవర్
-2017లో రూ. 3.3 లక్షల కోట్ల టర్నోవర్
-40 సంవత్సరాల్లో టర్నోవర్‌లో 4700 శాతం వృద్ధి రేటు
-32 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు సాధించిన రిలయన్స్
-గత 40 ఏళ్లలో 10వేల రెట్లు పెరిగిన నికర లాభం
-50 వేల రెట్లు పెరిగిన మార్కెట్ క్యాప్
-3,500 నుంచి 2.5 లక్షలకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య
-ప్రతీ రెండున్నరేళ్లకు రెట్టింపు అయిన మదుపర్ల సంపద
-1977లో రూ. 1000 పెట్టుబడితే ఇప్పుడు దాని విలువ రూ. 16.5 లక్షలు
-170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను అందుకున్న రిలయన్స్ జియో
-వరుసగా ప్రపంచరికార్డులను బద్దలు కొడుతున్న రిలయన్స్ -ఇండస్ట్రీస్-ముకేష్ అంబానీ
-గత 40 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించిన కంపెనీలలో ఒకటి
-దేశంలో మరే ఇతర కార్పొరేట్ కంపెనీ ఈ స్థాయి వృద్ధి సాధించలేదు..
-తండ్రిని తలుచుకుని భావోద్వేగం
-ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వృద్ధి కనబరిచిన కంపెనీలు కొన్నే- ముకేష్ అంబానీ
-10 కోట్ల కస్టమర్లను జియో అధిగమించింది
-ప్రస్తుతం రిలయన్స్ జియోకు 12.5 కోట్ల మంది కస్టమర్లు
-సగటున ప్రతీ 7 సెకండ్లకు ఒక కస్టమర్

 

-ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కంటే వేగంగా జియోకు ఆదరణ
-వీడియోలకు నెలకు 125 కోట్ల జీబీ ఇంటర్నెట్ వినియోగం
– ప్రతీ రోజూ 250 కోట్ల నిమిషాల కాల్స్
-మొబైల్ డేటా వినియోగంలో నెంబర్ వన్ స్థానంలో ఇండియా
-ఫ్రీ నుంచి పెయిడ్ సబ్‌స్క్రైబర్లుగా మారడం అతి పెద్ద రికార్డ్
-ఉచిత కస్టమర్లను పెయిడ్ కస్టమర్లుగా మార్చగలిగాం..
-10 కోట్ల మంది కంటే అధికంగా పెయిడ్ కస్టమర్లు- ముఖేష్ అంబానీ
-జియో ప్రైమ్, ధన్ ధనా ధన్ ప్లాన్స్ కొనసాగుతాయ్
-ఇండియాలో 78 కోట్ల మొబైల్ ఫోన్స్
-ఇందులో 50 కోట్ల ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి
-డిజిటల్ ఇండియా లక్ష్యంలో వీరు భాగం కాలేకపోతున్నారు
-అందరికీ డిజికల్ సాధికారత లేకపోవడం బాధాకరం- ముకేష్ అంబానీ
-రాబోయే 12 నెలల్లో దేశంలోని 99 శాతం మందికి అందుబాటులో జియో సేవలు
-ఇండియాలో 2జీ కవరేజ్ కంటే 4జీ కవరేజ్ ఎక్కువ- ముకేష్ అంబానీ
-పోటీ కంపెనీలకు 2జీ కవరేజ్ నిర్మాణానికి 25 ఏళ్లు పట్టింది..
-3 ఏళ్లలోనే అంతకు మించిన 4జీ నెట్వర్క్ నిర్మించాం- ముకేష్ అంబానీ
-50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగాదారులు డేటా సేవలను మరింత దగ్గర చేస్తున్నాం.
-మేడ్ బై ఇండియా.. మేడ్ ఫర్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా- ముకేష్ అంబానీ
-సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 10వేల జియో ఆఫీస్‌లు
-ఇంటెలిజెంట్ స్మార్ట్‌ఫోన్ “జియో ఫోన్” లాంఛ్ చేసిన ముకేష్ అంబానీ
-జియో కస్టమర్లకు 100శాతం 4జీ వీఓఎల్టీఈ జియో ఫోన్‌ ఉచితం
-రూ. 153 లకే నెలకు అన్ని సేవలు ఉచితం
-1500 వన్‌ టైం సెక్యూరిటి డిపాజిట్‌
-3 సం.రాల తరువాత పూర్తిగి ఈ డిపాజిట్‌ రిఫండ్‌
-భాషా అనేక్‌ భారత్‌ ఏక్‌ 22 భాషల్లో
-ఆగస్టు 15నుంచి ట్రయల్‌ రన్‌
-సెప్టెంబర్‌ నుంచి ఈ డివైస్‌లుఅందుబాటులోకి రానున్నాయి.

To Top

Send this to a friend