శూర్పణఖ గా రెజీనా…

 
భారతము  ,రామాయణంలోని పాత్రలని నేటి తరానికి అన్వయించి సినిమాలు తీయడం ఎప్పటి నుంచో వస్తున్నదే..తాజాగా మరో రామాయణ  పాత్ర ఒక సినిమాకి కథా వస్తువుగా మారింది. శ్రీ రాముడు అరణ్య వాసం చేసే సమయంలో అతన్ని మోహించి భంగపడిన రాక్షసి శూర్పణఖ కథ ఇపుడు సినిమాగా రాబోతుంది. రొటీన్ లవ్ స్టోరీ చిత్రం తో తెలుగులో కథానాయికగా పరిచయం అయిన రెజీనా అపుడపుడు మన చిత్రాల్లో తళుక్కున మెరుస్తోంది. కానీ ఆమె టాలెంట్ కి తగ్గ పాత్ర ఇంతవరకు రాలేదని చెప్పాలి. గత  ఏడాది  వచ్చిన  ఎవరు చిత్రం ఆమె లోని నటిని కొంతవరకు వెలికి తీసిందని చెప్పొచ్చు. ఆ చిత్రం ఇచ్చిన విజయం స్ఫూర్తి తో రెజీనా ఇపుడు మరో ప్రయోగానికి పూనుకొంది. రామాయణ ఇతిహాసం లోని శూర్పణఖ పాత్ర స్ఫూర్తి తో నెగటివ్ షేడ్స్ కలిగిన ఒక లేడీ పాత్రలో త్వరలో దర్శనమివ్వ బోతోంది. గత ఏడాది సందీప్ కిషన్ హీరోగా నిను వీడని నీడను నేనే  చిత్రాన్ని డైరెక్ట్ చేసి విజయం సాధించిన కార్తీక్ రాజు ఇపుడు రెజీనా కెసెండ్రా హీరోయిన్ గా తెలుగు,తమిళ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.” నేనే నా” అన్న పేరుతొ తెలుగులో వస్తున్న ఈ చిత్రానికి తమిళంలో మాత్రం శూర్పణకై  [ శూర్పణఖ] పేరునే పెట్టడం జరిగింది.  ఇక రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ లో రెజీనా అందర్నీ ఆకట్టుకొని సినిమా ఫై అంచనాలు పెరిగేలా చేసింది.
To Top

Send this to a friend