రెడ్ మీ ఫోన్లు.. పేలిపోతున్నాయి..

ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఫోన్లు ఏవో తెలుసా..? రెడ్ మీ మొబైల్స్.. ఆన్ లైన్ లో.. హాఫ్ లైన్లో ఈ ఫోన్ల కొనుగోళ్లకు జనం ఎగబడుతున్నారు. అత్యధిక ఫీచర్లు ఉండి.. అతితక్కువ ధర ఉండడంతో వీటి కొనుగోళ్లకు జనం ఆసక్తి చూపుతున్నారు.

రెడ్ మీ చైనా మొబైళ్లు వరుసగా పేలిపోతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట వీటి పేల్లుళ్ల వార్తలు సంచలనంగా మారాయి. చార్జింగ్ పెడుతుండగానో.. లేక పెట్టిన కాసేపటికో ఈ ఫోన్లు పేలిపోతున్నాయి. ఇటీవల తూర్పు గోదావరి , విశాఖ జిల్లాల్లో రెడ్ మీ నోట్ పేలిన ఘటనలు మరువక ముందే తాజాగా చిత్తూర్ జిల్లాలోనూ మరో ఘటన చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లాలోని వేల్కూరుకు చెందిన కే అజిత్, రెడ్ మీ నోట్ 4 ఎక్స్ 2 బ్రాండ్ మోబైల్ ను ఈ ఏడాది జూన్ 16న ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. గురువారం రాత్రి ఇంట్లో మొబైల్ చార్జింగ్ పెడుతుండగా పేలిపోయింది. సర్వీస్ సెంటర్ల చుట్టు తిరిగినా ఫలితం దక్కలేదని బాధితుడు అజిత్ చెప్పాడు.

To Top

Send this to a friend