శిరీష-ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల వెనుక .?

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఇది రెండో ఆత్మహత్య. అంతకుముందు ఇక్కడ ఎస్.ఐగా పనిచేసిన ఎస్.ఐ కూడా ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా అదే స్టేషన్ లో ఎస్.ఐ పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి కూడా అదే రీతిలో రివాల్వర్ కణతకు కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. రెండు ఆత్మహత్యలే.. రెండు తుపాకీతోనే జరిగాయి. ఒకటి ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక అయితే.. రెండోది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.

ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. బుధవారం హైదరాబాద్ ఫిలింనగర్ లో బూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతికి ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డియే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. శిరీష ఆత్మహత్య చేసుకుందని తెలియగానే ప్రభాకర్ రెడ్డి కుకునూర్ పల్లిలో తుపాకీ తో కాల్చుకొని చనిపోయాడు.

అయితే శిరీషకు, ప్రభాకర్ రెడ్డి గతంలోనే పరిచయం ఉందని తెలిసింది. కుకునూర్ పల్లికి ఓ సారి వచ్చిన శిరీష బృందానికి ప్రభాకర్ రెడ్డి విచారణ పేరుతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆమె కోసం మరోసారి హైదరాబాద్ లోని శిరీష పనిచేస్తున్న ఫొటోగ్రఫీ షాప్ కు వచ్చాడని.. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలిసింది. శిరీష, ఎస్.ఐ ఆత్మహత్యతో వీరిద్దరి మధ్య సాక్షిగా ఇప్పుడు శిరీష పనిచేస్తున్న ఫొటోగ్రఫీ స్టూడియో యజమాని వల్లభనేని రాజీవ్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఆ రాత్రి శిరీష-ఎస్.ఐ మధ్య ఏం జరిగిందనేది తేలితే ఈ కేసు చిక్కుమడి వీడినట్టేనని పోలీస్ ఉన్నతాధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

To Top

Send this to a friend