బాలయ్యకు నో చెప్పండం వెనుక కారణం ఇదే

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌కు తాజాగా నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. తమిళ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో రాజశేఖర్‌ విలన్‌గా నటించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్ర నచ్చకపోవడంతో సినిమాను తిరష్కరించినట్లుగా తెలుస్తోంది. పాత్ర ప్రాముఖ్యత పెంచడంతో పాటు, పారితోషికం కూడా కాస్త ఎక్కువ ఇవ్వాల్సిందిగా రాజశేఖర్‌ డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆ స్థానంలో శ్రీకాంత్‌ను తీసుకున్నారు.

ఇంత కాలం హీరోగా నటించిన రాజశేఖర్‌కు విలన్‌ వేశాలు వేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉందట. అయితే విలన్‌ పాత్ర పవర్‌ ఫుల్‌గా ఉండటంతో పాటు, ఫుల్‌ లెంగ్త్‌ ఉండాలని, హీరోకు ఏమాత్రం తగ్గకుండా విలనిజం ఉండాలనే షరతులతో ఈయన విలన్‌ పాత్రలను ఒప్పుకుంటాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇటీవలే ‘ధృవ’ చిత్రానికి నో చెప్పిన రాజశేఖర్‌ తాజాగా బాలయ్య సినిమాకు నో చెప్పాడు.

ప్రస్తుతం జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్‌ ఒక భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. గరుడ వేగ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆ సినిమాపై రాజశేఖర్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా సక్సెస్‌ అయితే హీరోగా మరిన్ని సినిమాలు చేయవచ్చు అనేది ఈయన అభిప్రాయంగా తెలుస్తోంది.

To Top

Send this to a friend