వరుణ్ సందేశ్ భార్య సూసైడ్ వెనుక..

హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక సూసైడ్ చేసుకుందనే వార్త మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. సంవత్సరం క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఏమైంది అని అందరూ ఆడిపోసుకున్నారు. ఈ విషయంపై అందరూ ఆరాతీయగా వితిక అసలు విషయం వెళ్లడించింది. తాను ఆత్మహత్య చేసుకోలేదని.. ఆస్పత్రిలో ఉన్నానన్న వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది. తాను వరుణ్ సందేశ్ హ్యాపీగా ఉన్నామని చెప్పుకొచ్చింది.

వారి పెళ్లై సంవత్సరం కూడా తిరగకముందే వితిక ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ వితికలు ఓ సినిమాలో కలిసి నటించారు. అనంతరం ప్రేమలో పడి సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. మూడు నెలలు అమెరికాలో హనీమూన్ జరుపుకున్న ఈ జంట ఆ తర్వాత ఇటీవలే ఇండియా వచ్చేసింది. అయితే ఓ యూట్యూబ్ బిట్ లో నటించేందుకు వరుణ్ మళ్లీ అమెరికా వెళ్లాడు. వితిక ఒక్కతే వరుణ్ ఫ్లాట్ లో ఉంటోంది. సడన్ గా 4 నిద్రమాత్రలు మింగేసింది. ఆమె తల్లి బంధువులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అయితే వితిక మాత్రం తాను నిద్రపట్టకపోవడం వల్లే నిద్రమాత్రలు మింగానని అంతేతప్ప ఆత్మహత్య ఉద్దేశం తనకు లేదని చెబుతోంది. అమెరికాలో ఉండి రావడంతో అక్కడి వాతావరణం, ఇక్కడి వాతావరణం పడక 48 గంటలు నిద్ర పట్ట లేదని.. నిద్ర పట్టడానికి 4 మాత్రలు వేసుకొని నిద్రపోయానన్నారు. అత్తయ్య, వరుణ్, అమ్మ ఫోన్ చేస్తే తీయపోయేసరికి వచ్చి ఆస్పత్రికి తరలించిందని చెప్పుకొచ్చారు.

నాకు, హీరో వరుణ్ సందేశ్ కు మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వితిక వివరణ ఇచ్చింది. తాము హ్యాపీగా ఉంటున్నామని చెప్పుకొచ్చింది. అయితే వితిక నిజాన్ని దాస్తోందని.. వారి కాపురంలో ఏదో జరిగి ఉంటుందనే ప్రచారం మాత్రం ఊపందుకుంది.

To Top

Send this to a friend