బిగ్ బాస్ నుంచి ధన్ రాజ్, కత్తి కార్తీక ఔట్.. కారణం.?

బిగ్ బాస్ లో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ధన్ రాజ్, కత్తి కార్తీకలు హౌస్ వదిలి పోయారు. కత్తికార్తీక హౌస్ లో ఏమాత్రం యాక్టివ్ గా లేదు. అమె నొప్పించక.. తానొవ్వక అన్నట్టు స్తబ్ధుగా ఉండడంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు. ఇలా కత్తి కార్తీక ఎలిమినేషన్ కు ఓ రీజన్ ఉండగా.. ధన్ రాజ్ ను మాత్రం అతడి భార్య డెలివరీ కారణంగానే బయటకు పంపినట్టు సమాచారం. శని, ఆదివారాల్లో బిగ్ బాస్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎవ్వరూ ఊహించని మలుపులు వచ్చాయి.

రెండు వారాల క్రితం మహేశ్ కత్తి, కల్పనను ఎలిమినేట్ చేసిన ఎన్టీఆర్ గడిచిన వారం మాత్రం ఎలిమినేట్ అయిన ముమైత్ ను మళ్లీ హౌస్ లోకి పంపించారు. ఈ వారం ఏకంగా మరోసారి డబుల్ ధమాకాలో ధన్ రాజ్, కత్తికార్తీకను బయటకు పంపించారు. ప్రేక్షకుల ఓటింగ్ మేరకే అని చెబతున్నా.. దీనిపై అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి..నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న అందరు సెలబ్రెటీలలో మంచి కామెడీ టైమింగ్ తో హౌస్ లో ధన్ రాజ్ సందడి చేస్తుండగా.. ముమైత్ గొడవలు, రోమాంటిక్ చేష్టలతో అలరిస్తుంది. దీంతో ముమైత్ ను కొనసాగించగా ధన్ రాజ్ ను ఎలిమినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే దీని వెనుక ప్రధానంగా ధన్ రాజ్ భార్య పురుడుపోసుకోవడమే కారణం.. ధన్ రాజ్ కు తల్లిదండ్రులు లేరు. భార్య తరఫున వారి అమ్మ మాత్రమే ఉంది. సో పుట్టబోయే బిడ్డకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ధన్ రాజ్ ఆందోళనగా ఉంటున్నాడు. డెలవరీ దగ్గరపడుతుండడంతో ధన్ రాజ్ ఎలిమినేషన్ లో లేకున్నా కూడా అతడి భార్యకు తోడుగా పంపేందుకు హౌస్ నుంచి అతడి కోరిక మేరకే ఎలిమినేషన్ పేరుతో బయటకు పంపినట్టు సమాచారం. అర్చన ఎలిమినేట్ అవుతుందని భావించగా ఆమె స్థానంలో ధన్ రాజ్ కు ఉన్న వ్యక్తిగత సమస్యల వల్లే అతడిని బయటకు పంపినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

To Top

Send this to a friend