రవితేజ ఆశలన్నీ కొత్త దర్శకులపైనే..

రవితేజ.. మాస్ మహారాజా.. యూత్ ఫుల్, ఎనర్జిటిక్ కథలతో ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపు ఊపిన రవితేజకు ఇప్పుడు హిట్ లేక చాలా కాలమైంది. పెద్ద దర్శకులతో చేసినా.. కొత్త దర్శకులతో చేసినా సరే రవితేజకు ఒక్క భారీ హిట్ కూడా దక్కడం లేదు. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన కిక్ లాంటి భారీ హిట్ తర్వాత రవితేజ తీసిన సినిమాలన్నీ యావరేజ్ లేదంటే ప్లాపులు అవుతూనే ఉన్నాయి. కిక్ తీసిన టాప్ దర్శకుడు సురేందర్ రెడ్డితో రెండేళ్ల క్రితం తీసిన కిక్ 2 కూడా ప్లాప్ కావడంతో ఇక అప్పటి నుంచి ఈ మాస్ మహారాజా కోలుకోవడం లేదు.

కిక్2 తర్వాత రవితేజ పెద్ద దర్శకులతో సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఫ్రెష్ కథలను వింటూ.. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న రెండు సినిమాలు కొత్త దర్శకులతోనే చేస్తున్నారు. పటాస్, సుప్రీం మూవీలతో హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ ‘రాజా ది గ్రేట్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే వినాయక్ శిష్యుడు విక్రం సిరి దర్శకత్వంలో సినిమా కమిట్ అయ్యాడు.

రవితేజ చేస్తున్న రెండు సినిమాలకు ఇద్దరు కొత్త దర్శకులే.. ఈ సినిమాలు రిలీజ్ కాకముందే మరో కొత్త దర్శకుడికి రవితేజ అవకాశం ఇచ్చారు. ఇటీవల కేశవ సినిమాతో హిట్ కొట్టిన నూతన దర్శకుడు సుధీర్ వర్మతో ఓ సినిమా చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడట.. స్వామి రారా, కేశవ సినిమాలతో మంచి ఫాంలో ఉన్న సుధీర్ వర్మ… రవితేజకు భారీ హిట్ ఇస్తాడన్న నమ్మకంతో టాలీవుడ్ జనాలు ఉన్నారు. డిఫరెంట్ కథలతో, థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో సినిమాలు తీస్తున్న సుధీర్ పైనే ఇప్పుడు రవితేజ కోటి ఆశలు పెట్టుకున్నాడట..

To Top

Send this to a friend