తమ్ముడి మరణంపై రవితేజ సంచలన వ్యాఖ్యలు..

మీడియా అక్కసు వెళ్లగక్కాడు రవితేజ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవితేజ.. కనీసం తమను సంప్రదించకుండా తమ్ముడు భరత్ చావుపై ఇష్టమొచ్చినట్టు రాసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి గురించి రాసేటప్పుడు మీడియా కాస్త అయినా ఆలోచించాలని అన్నారు రవితేజ. సొంత మనుషులు చనిపోతే రాలేని పరిస్థితుల్లో ఉంటే అంత అమానుషంగా విమర్శిస్తారా.? హిట్ల కోసం రేటింగ్ కోసం సోషల్ మీడియాలో మరీ అంత రాద్ధాంతం చేస్తారా’ అని రవితేజ ఆవేదన వ్యక్తం చేశారు.

అతిగా మద్యం సేవించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో భరత్ ను చూడడానికి అన్న రవితేజ కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎవరూ రాలేదు. దీనిపై సోషల్ మీడియాలో, వెబసైట్లలో హోరెత్తింది. రవితేజ వైఖరిపై అందరూ విమర్శలు గుప్పించారు. ఆడిపోసుకున్నారు. ఎట్టకేలకు ఈ వివాదంపై రవితేజ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆ పరిస్థితిని వివరించారు.

‘నాతోపాటు 20 ఏళ్లు పెరిగిన తమ్ముడితో మరణిస్తే నేను రాకుండా ఉంటానా..? తోడ బుట్టిన సొంత తమ్ముడు చనిపోయాడని తెలియగా అందరం కుప్పకూలిపోయాం. 85ఏళ్ల మా నాన్న , అమ్మ సృహ తప్పి పడిపోయారు. వారిని ఆస్పత్రిలో వేసి నేను అక్కడే ఉన్నా.. తమ్ముడు రఘును భరత్ అంత్యక్రియలు చెప్పమని చెప్పాం. కానీ రఘు ఈసమయంలో తల కొరివి పెట్టే పరిస్థితులో లేడు. అందుకే మా బాబాయి చేత అంత్యక్రియలు నిర్వహించాం. ఆయన మా బాబాయ్ అని మీడియా తెలియకపోవడంతో ఇష్టమొచ్చినట్టు రాశారు. ఎవరిచేతో తలకొరివి 1500 ఇచ్చి చేయించారని రాశారు. రాసేముందు ఒక్కసారి మమ్మల్ని అడిగి రాస్తే బాగుండేది. భరత్ ను అనాథగా వదిలేశారని రాయడం మా మనసులను బాధపెట్టిందని వాపోయారు రవితేజ..

To Top

Send this to a friend