జీఎస్టీతో భారీగా తగ్గనున్న ధరలు..

ఇక నుంచి దేశం మొత్తం ఒకే పన్ను.. రాష్ట్రానికో పన్ను అనే విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. ప్రతి రాష్ట్రం ఇక నుంచి పన్నులు వసూలు చేయడానికి వీలు లేదు. దేశవ్యాప్తంగా అంతా ఆన్ లైన్ సరుకులు, వస్తువులు ఇలా అన్నింటికి ఒకే పన్ను.. ఒక దేశం నినాదం అమలు కాబోతోంది.. ఎన్టీఏ ప్రభుత్వం జూన్ 1 నుంచి అమలు చేయనున్న వస్తు సేవల పన్నుతో దేశీయ వ్యాపార రంగంతో పాటు ప్రజలకు కూడా తక్కువ ధరలో అన్ని సమకూరబోతున్నాయి.

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో పప్పు, ఆహారపదార్థాలు, రోజువారీ నిత్యావసర సరుకుల ధరలు చవకగా మారనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 1211 వస్తువుల్లో ఆరు మినహా మిగతా వాటన్నింటికీ జీఎస్టీ ధరలను నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. జీఎస్టీ పన్ను విధానం నుంచి పాలు, పప్పుధాన్యాలకు పన్ను మినహాయించినట్లు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హెచ్‌.అథియా వెల్లడించారు. దీంతో పాటు పలు ఆహారపదార్థాల ధరలు తగ్గనున్నట్లు తెలిపారు. హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు, టూత్‌పేస్టుల ధరలు పెరగనున్నాయి. వాటిపై 18శాతం పన్ను విధించనున్నారు. పంచదార, టీపొడి, కాఫీ పొడి, వంటనూనెపై 5శాతం పన్ను విధించనున్నారు.

బొగ్గుపై ప్రస్తుతం 11.69శాతం పన్ను ఉండగా దాన్ని 5శాతానికి తగ్గించనున్నట్లు అథియా పేర్కొన్నారు. అన్ని వస్తువులపై ధరలను నిర్ణయించడం సాధ్యం కాకపోతే మరోసారి సమావేశం ఏర్పాటు చేసి ధరలను నిర్ణయిస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఈ దేశవ్యాప్తంగా ఒకే పన్ను వల్ల ప్రస్తుతం ఉన్న రేట్లన్నీ మరో సారి తగ్గిపోయి సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి.

To Top

Send this to a friend