నాగచైతన్య చిత్రాల్లో అత్యధికంగా మొదటి వారం 20 కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేసిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కింగ్‌ నాగార్జున నిర్మించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ మే 26న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేసి నాగచైతన్య చిత్రాల్లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ నిలిచింది. అన్నపూర్ణ స్డూడియోస్‌ పతాకంపై మనం, సోగ్గాడే చిన్నినాయనా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన కింగ్‌ నాగార్జున ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సాధించిన సూపర్‌హిట్‌తో హ్యాట్రిక్‌ సాధించారు. మనం ఆడియో ఫంక్షన్‌లో సోగ్గాడే చిన్నినాయనా చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టబోతున్నామని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. చెప్పినట్టుగానే ఆ చిత్రం సంక్రాంతి సూపర్‌హిట్‌ అయ్యింది. అలాగే రారండోయ్‌ వేడుక చూద్దాం కూడా పెద్ద హిట్‌ అవుతుందని ముందుగానే చెప్పారు. ఈ సినిమా కూడా భారీ ఓపెనింగ్స్‌తో మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల షేర్‌ కలెక్ట్‌ చేసి కింగ్‌ నాగార్జున చెప్పినట్టుగానే సూపర్‌హిట్‌ సినిమాగా నిలిచింది. ఇలా వరసగా మూడు సూపర్‌హిట్స్‌ అందించి నిర్మాతగా హ్యాట్రిక్‌ సాధించారు కింగ్‌ నాగార్జున.
హీరోగా నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ నుండి మంచి అప్లాజ్‌ వచ్చింది. అలాగే హీరోయిన్‌ రకుల్‌కి ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. నిర్మాతగా నాగార్జునకి ఇది మరో సూపర్‌హిట్‌ కాగా, దర్శకుడిగా కళ్యాణ్‌ కృష్ణకు రెండో హిట్‌. ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్న ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ రెండోవారంలో కూడా ఆల్‌ సెంటర్స్‌లో సూపర్‌ షేర్స్‌ని రాబట్టుకుంటూ సూపర్‌హిట్‌గా నిలిచినందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌ టీమ్‌ చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది. అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు అన్నపూర్ణ సంస్థ కృతజ్ఞతలు తెలిపిరది.

To Top

Send this to a friend