రేప్ చేసి.. తిరుపతిలో దారుణం..

  • యువతిని రేప్ చేసి హత్య… చేయిపై ‘అనిత’ అని టాటూ…

తిరుపతిలో దారుణం జరిగింది. 25 యేళ్ళ యువతిని రేప్ చేసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతి-తిరుచానూరు రోడ్డులోని మార్కెట్ యార్డు వెనుక ఒక మహిళ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా యువతి శవం కనిపించింది. ముఖంపై రాయితో కొట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి వయస్సు 25 యేళ్ళు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

ప్రేమ, అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. డాగ్ స్వ్కాడ్ వచ్చి పలు అనుమానిత ప్రాంతాలను, వ్యక్తులను గుర్తించినట్టు సమాచారం. ప్రాథమికంగా దొరికిన ఆధారాలు, మహిళ ఫోన్ డేటా ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

To Top

Send this to a friend