మగాళ్లు మగాళ్లు ముద్దిచ్చుకోవడం ఏంటీ హీరో..

రణబీర్ కపూర్.. బాలీవుడ్ లో దూసుకొచ్చిన యంగ్ హీరో.. బర్ఫీ నుంచి మొదలైన అతడి నట ప్రస్థానం.. సావరియా.. ముంబై వాలెట్, యే దిల్, తమాషా , రాక్ స్టార్ ఇలా లవర్ బాయ్ సినిమాలతో ఓ రేంజ్ కు వెళ్లింది. లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకొని పాపులర్ అయ్యాడు. ఆ మధ్య కత్రినాతో ప్రేమలో మునిగి అనంతరం ఆమె ను వదిలేసిన ఈ ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్ గా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.

రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘గల్తీ సే మిస్టేక్’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయి ముంబైలో ఆడియో వేడుక జరుగుతోంది.. ఇందులో వేదికపై పాటలు విడుదల చేసేటప్పుడు రణబీర్ కపూర్ ఒక్కసారిగా గల్తీ సే మిస్టేక్ డైరెక్టర్ అనురాగ్ బసుకు లిప్ టు లిప్ ముద్దిచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.

లవర్ బాయ్ లాంటి రణబీర్ కపూర్ పక్కనే హీరోయిన్ ఉన్న కూడా ముసాలాయన అయిన డైరెక్టర్ అనురాగ్ బసుకు ముద్దివ్వడంపై అందరూ షాక్ కు గురయ్యారు. మగాళ్లు ఇలా వేదికపై ముద్దు ఇచ్చుకోవడం వెగటుపుట్టించిందని మీడియా , నటులు ఆడిపోసుకున్నారు.

To Top

Send this to a friend