కోడు గుడ్డు మీద ఈకలు పీక్కండి

రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనేరాజు నేనేమంత్రి’ చిత్రం ట్రైలర్‌ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. దాంతో కొన్ని డైలాగ్స్‌ ప్రేక్షకుల్లో బాగా పేలాయి. కొన్ని రోజుల్లో సీఎం సీటు నా ముడ్డి కింద ఉండాలి…, వంద మంది ఎమ్మెల్యేలను స్టార్‌ హోటల్‌లో కూర్చోబెడితే సాయంత్రం వరకు నేనే సీఎంను అవుతాను అంటూ రానా చెప్పిన డైలాగ్స్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ డైలాగ్‌లు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

ఈ సమయంలోనే ఈ డైలాగ్‌లు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. రానా అప్పటి వైశ్రాయ్‌ సంఘటనను ఈ డైలాగ్‌తో గుర్తు చేస్తున్నాడని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ విషయమై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. దాంతో వివాదం పెరుగుతుందనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తనకు సన్నిహితుడు అయిన ఒక మీడియా పర్సన్‌ వద్ద రానా ఈ విషయాన్ని స్పందిస్తూ కోడు గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ లేని విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడట. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పరిస్థితిని అద్దం పట్టేలా ఆ డైలాగ్‌ ఉంది తప్ప, ప్రత్యేకంగా ఏ ఒక్కరిని ఉద్దేశించి దానిని పెట్టేలేదు అన్నాడు. పరిస్థితి చూస్తుంటే సినిమాలో ఆ డైలాగ్‌ ఉండే అవకాశం లేదనిపిస్తుంది.

To Top

Send this to a friend