పెళ్లి పై బాంబు పేల్చిన హీరో రానా..

 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రానాను ఎవరైనా పెళ్లి ఎప్పుడే అంటే చిటపటలాడుతారు. ‘అరె నాకంటే పెద్దవారు ఇండస్ట్రీలో ఉండగా నా పెళ్లికి ఎందుకు అంత తొందర’ అని రానా బదులిస్తుంటారు. కానీ ఇటీవల జరిగిన రానా నిర్వహించే షోలో పాల్గొన్న సెలబ్రెటీలు పెళ్లి ఎప్పుడు రానా అంటూ అడిగారు. దీంతో రానా వారికి ఓ నిజం చెప్పాడు.

 

సినీ పరిశ్రమలో రానాకు చాలా మంది స్నేహితులున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా రానాకు ఫ్రెండ్స్ ఎక్కువ. వారిలో చాలా మందికి పెళ్లిళ్లు అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఇంకా రానా పెళ్లి చేసుకోకపోవడంపై అందరూ వేలెత్తిచూపుతూనే ఉంటారు.

 

తాజాగా జెమిని టీవీలో జరిగిన నంబర్1 యారీ షోలో రానాను షోకు వచ్చిన గెస్ట్ లు పెళ్లి ఎప్పుడో చెప్పాలని ఒత్తిడి చేశారు. దీనికి రానా ఓ కండీషన్ పెట్టాడు.. ‘నా పెళ్లి ఖచ్చితంగా నాకంటే పెద్దవారైన ప్రభాస్, నితిన్ ల తర్వాతే ఉంటుంది. వాళ్లు పెళ్లిళ్లు అయ్యాకే నా పెళ్లి గురించి అడగండి.. నాకింకా 33 సంవత్సరాలు మాత్రమే. వాళ్ల పెళ్లిళ్లే కాలేదు.. నా కుటుంబ సభ్యులు కూడా నా పెళ్లి గురించి ఇంకా ఆలోచించడం లేదు..మీకెందుకు తొందర’ అని రానా వారిని ప్రశ్నించడంతో రానా పెళ్లి విషయం పక్కకు పోయింది. ఇప్పుడు రానా పెళ్లి కావాలంటే ముందు ప్రభాస్, నితిన్ ల పెళ్లి అవ్వాలన్నమాట.. అంటే వారి వయసు 35కు దగ్గరగా ఉందన్నమాట.. ఇలా ప్రభాస్, నితిన్ లు తనంకంటే ముదుర్లు అని చెప్పి రానా బాంబు పేల్చాడు.

To Top

Send this to a friend