రానా చేతుల మీదుగా లవ్ లైఫ్ అండ్ పకోడీ ట్రైలర్ విడుదల

Love Life And Pakodi Trailer

ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నో కమిట్ మెంట్స్, నో బుల్ షిట్స్, లెట్స్ కీపిట్ సింపుల్ అనేది వాళ్ల మాట. ప్రేమ కాదు, ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించింది అంటూ ఈ బంధాలకు కొత్త పేర్లు పెడుతున్నారు యువత. నేటి ట్రెండ్ కు అద్దం పట్టే ఇలాంటి అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ. బుధవారం ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న రానా, చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

యూత్ ట్రైండ్ పల్స్ పట్టుకున్నట్లుందీ ట్రైలర్. ఈ చిత్రంలో కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ‌, జంట‌గా నటించారు. క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ లో దర్శకుడు జయంత్ గాలి లవ్ లైఫ్ అండ్ పకోడీ చిత్రాన్ని రూపొందించారు. హీరో హీరోయిన్లకిది తొలి చిత్రం. ఒక రిలేష‌న్ కి క‌మిట్అయ్యేందుకు క‌న ఫ్యూజ్ అయ్యే జంట కు వారి మ‌ద్య ప్రేమే స‌మ‌స్య‌గా ఎలా మారుతుంది అనేది ఆస‌క్తిగా తెర‌మీద‌కు క‌నువిందు చేయ‌బోతుంది. త్వరలో లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆక‌ర్ష్ రాజ్ భాగ‌వ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్ , క‌ళా జ్యోతి , అనురాధ మ‌ల్లికార్జున తదితరులు ఇతర ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపిః సాగ‌ర్ వైవివి జ‌తిన్ మోహాన్, మ్యూజిక్ః ప‌వ‌న్, ఎడిట‌ర్ః శ్ర‌వ‌న్ క‌టికనేని, ఆర్ట్ః దండు రెంజీవ్, పి ఆర్ ఓ ః జియ‌స్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వెంక‌ట సిద్దారెడ్డి, స‌మ‌ర్స‌ణ ః మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, నిర్మాత‌,ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వంః జ‌యంత్ గాలి

To Top

Send this to a friend