కొత్త ట్రెండ్ కి రానా శ్రీకారం

– అభిమానుల కుటుంబాలతో దగ్గుబాటి హీరో ఫొటో సెషన్

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పెద్ద కుమారుడు , యువ హీరో రానా కెరీర్ ప్రారంభం నుంచి భిన్నంగా రాణిస్తున్నాడు‌. తన రెండో సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరో బాహుబలితో విలన్ గాను మెప్పించిన విషయం తెలిసిందే.

తన తండ్రి సురేష్ బాబు నిర్మిస్తున్న తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి ప్రచార కార్యక్రమాన్ని ఏఆర్ టెక్నాలజీ తో వినూత్న ప్రయత్నానికి శ్రీ కారం చుట్టాడు‌. అదే తరహాలో బాబాయ్ విక్టరీ వెంకటేష్ అభిమానులు, తన అభిమానుల కుటుంబాలతో కలిసి రానా ఫొటో సెషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది .

ఆగస్టు రెండో తేదీన హైదరాబాదులో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ స్టార్ హోటల్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అభిమానులందరూ ఆగస్టు రెండో తేదిన హైదరాబాద్ కు రావాలని మెసేజ్ లు పంపినట్లు సమాచారం. రానా తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తొ పాటు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రానా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో దగ్గుబాటి అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది‌.

To Top

Send this to a friend