రానా, కాజల్‌ది జన్మజన్మల అనుబంధం!!


‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించి మెప్పించిన రానా తాజాగా తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించాడు. ఆ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నారు. తాజాగా ఆ సినిమా టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమా టీజర్‌ విడుదల సందర్బంగా ‘బాహుబలి’ సినిమాలో మీ భార్య ఎవరు అంటూ సోషల్‌ మీడియాలో ఒక అభిమాని నుండి రానాకు ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా ‘బాహుబలి’లో తన భార్య కాజల్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.

‘బాహుబలి’లో కాజల్‌ తన భార్య అని, అయితే ఆమె ఎవరికి కనిపించకుండా దర్శకుడు చేశాడని రానా చెప్పుకొచ్చాడు. రానా ట్వీట్‌కు కాజల్‌ స్పందించింది. ఈ విషయంలో నేనేం మాట్లాడలేను, మాది జన్మజన్మల బంధం అయ్యి ఉంటుంది అంటూ రీ ట్వీట్‌ చేసింది. ట్విట్టర్‌లో కాజల్‌, రానాల ట్వీట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. కాజల్‌ అలా రెస్పాండ్‌ అవుతుందని ఏ ఒక్కరు ఊహించి ఉండరు. రానాతో మొదటి సారి నటించిన కాజల్‌, అతడితో ఏర్పడిన స్నేహంతో ఇలా ట్వీట్‌ చేసింది.

చాలా సంవత్సరాలుగా సక్సెస్‌ లేక ఢీలా పడిపోయిన తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో కాస్త అనుమానాలు ఉండేవి. కాని టీజర్‌ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. తప్పకుండా భారీ విజయాన్ని ఈ సినిమా అందుకుంటుంది అనే నమ్మకంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

To Top

Send this to a friend