రామోజీ : కేసీఆర్ ప్రమోషన్ పాలసీ


ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు రూట్ మొత్తం చేంజ్ అయ్యింది. కానీ ఆయన మూలాలు మాత్రం ఇంకా కట్టుబడే ఉన్నారు. కాంగ్రెస్ కు ఆదినుంచి వ్యతిరేకంగా పనిచేయడమే రామోజీ స్వభావం.. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఒకప్పటి టీడీపీ నేత.. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేతపై ఈగ వాలనీయడం లేదు. వారంలో ఒక్కసారైనా తన ఈనాడు పత్రికలో కేసీఆర్ భజన చేయనిదే రామోజీ అండ్ కోకు నిద్రపట్టడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే.. ఏపీలో ఉన్న చంద్రబాబు కంటే కూడా కేసీఆర్ నే రామోజీరావు ఎక్కువగా మోస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈనాడు రాతల్లో రీతిలో కేసీఆర్ అనుకూల వైఖరి స్పష్టంగా కనపడుతోంది. వ్యతిరేకంగా ఎక్కడా రాయడం లేదు. రాస్తే గీస్తే.. ఆసుపత్రులు, నిర్లక్ష్యం, నిధుల కొరతపై అలా తమలపాకుతో అలా అలా వాయించివేస్తున్నట్టు మాత్రమే కథనాలు ఉంటున్నాయి. తప్పితే ఒకప్పటి వైఎస్ ను చీల్చిచెండాడిన కథనాలు ఇప్పుడు ఈనాడులో మచ్చుకైనా కనిపించవు..

ఈరోజు కూడా రామోజీరావు అదే పనిచేశారు. ఉగాది కానుకగా ఖమ్మం పట్టణంలో మంత్రి తుమ్మల రెండు పడకగదుల ఇళ్లను ప్రారంభించారు. అనంతరం నాగమణి అనే మహిళకు కేసీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇది చాలా క్యాజువల్ వార్త. అయినా కూడా ఈనాడు మొదటి పేజీలో ముఖ్యమంత్రిని బేస్ చేసుకొని వండి వార్చింది. ఉన్నది లేనిది కల్పించి కేసీఆర్ దయామయుడు అనట్టు పొగిడేసింది. ఒకప్పటిలా ఈనాడులో దమ్మున్న దుమ్మురేపే కథనాలు రావాలని పాఠకులందరూ ఎదురుచూస్తున్న అవే చప్పిడికథనాలతో రామోజీ వెనకబడిపోతున్నారనే విమర్శ అంతటా ఉంది..

To Top

Send this to a friend