సన్నీలియోన్‌ తర్వాత రామాయణం


వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లి పోయినా కూడా ఆయన తీస్తున్న సినిమాలు, ఆయనకు సంబంధించిన వార్తలు మాత్రం తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లి పోవడంలేదు. ఇటీవలే ఆయన తీసుకు వచ్చిన గన్స్‌ అండ్‌ థైస్‌ వెబ్‌ సిరీస్‌ ట్రైర్‌కు సంచలన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సన్నీలియోన్‌ అంటే అభిమానం అంటూ చెప్పే రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా ‘మేరీ బేటీ సన్నీలియోన్‌ బన్‌ చప్‌ాతాహై’ అంటూ ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో ఎలాంటి బూతు లేకుండా తెరకెక్కించినప్పటికి వర్మ వివాదాస్పదం అయ్యాడు. ఇక తాజాగా వర్మ దృష్టి రామాయణంపై పడ్డట్లుగా తెలుస్తోంది.

హిందువులు పరమ పవిత్రంగా భావించే రామాయణంలోని ఒక ఎపిసోడ్‌ను తీసుకుని తాను షార్ట్‌ ఫిల్మ్‌గా తీయబోతున్నాడు. దాన్ని సినిమా రూపంలో తీస్తే ఖచ్చితంగా సెన్సార్‌ నుండి బయటకు రాదు. వచ్చినా కూడా విమర్శలు వస్తాయి. అందుకే దాన్ని యూట్యూబ్‌లో తీసుకు రావాలని వర్మ భావిస్తున్నాడు. రాముడిని అడవులకు పంపాలంటూ దశరదుడిని కైకేయి అడిగిన సందర్బంను తీసుకుని షార్ట్‌ ఫిల్మ్‌ తీయబోతున్నాడు.

ఆ రాత్రి దశరధుడు మరియు కైకేయి మద్య జరిగిన పరిణామాలు, చర్చలు ఏంటి అనే విషయాన్ని కాస్త లోతుగా తనదైన శైలిలో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా వర్మ షార్ట్‌ ఫిల్మ్‌ను ప్లాన్‌ చేస్తున్నాడు. మొత్తానికి వర్మ సినిమాను వదిలేసి షార్ట్‌ ఫిల్మ్‌లతో రెచ్చి పోతున్నాడు.

To Top

Send this to a friend