వర్మ పోర్న్ సినిమా టీజర్ కలకలం..

బాహుబలి లాంటి అద్భుత క్రియేటివిటీ చిత్రం దేశ ప్రజలను సంభ్రమాశ్చార్యాలకు గురిచేస్తున్న ఈరోజుల్లో అసలేమాత్రం క్రియేటివిటీ లేకుండా మూస సినిమాలు తీస్తూ తెలుగు వారి పరువును ముంబై వేదికగా పోగొడుతున్నాడు రాంగోపాల్ వర్మ..ఇటీవలే హిందీలో అమితాబ్ తో సర్కార్ 3 తీసిన వర్మ ఆ సినిమా ప్లాప్ కాగానే ఇప్పుడు మరో బూతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా పక్కా బూతును నమ్ముకొని తీసిన ఈ సినిమాపై మహిళా సంఘాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ బూతు సినిమా దెబ్బకు వర్మ పని అయిపోయిందని అందరూ స్పష్టం చేస్తున్నారు.

ఈరోజు ఉదయం వర్మ చేసిన ట్వీట్ తో అందరిలోనూ ఆసక్తి రేగింది. రాంగోపాల్ వర్మ సాయంత్రం ఓ సప్రైజ్ ఇస్తానని చెప్పి కొత్త సినిమా టీజర్ విడుదల చేశాడు. ఈ సినిమాను హిందీలో తీశాడు. పేరు ’గన్స్ అండ్ థింగ్స్. ’పక్కా బూతు సినిమా.. ట్రైలర్ లోనే బెడ్ రూం సీన్ చూపించేశాడు. హీరో, హీరోయిన్లు బట్టలు లేకుండా న్యూడ్ గా నటించారు. హీరోయిన్ మొత్తం నగ్నంగా కనిపించింది. టీజర్ చూస్తే.. అచ్చం ఓ పోర్న్ సినిమా చూసినట్టు ఉంది. అసలు ఈ నగ్న చిత్రంలో నటించేందుకు ఆ హీరోయిన్, హీరో ఎలా ఒప్పుకున్నారో., మన దర్శకుడు వర్మ ఎలా తీశారో తెలియదు కానీ ఈ బూతు సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వర్మ తీసిన బూతు సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించారు. కానీ అప్పటికే అందరూ ఆ టీజర్ ను చూడడం డౌన్ లోడ్ చేయడం జరిగిపోయాయి. హీరో, హీరోయిన్లు బెడ్ రూంలో నగ్నంగా శృంగారం చేస్తున్న సీన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వర్మపై ఆగ్రహానికి కారణమయ్యాయి.

To Top

Send this to a friend