వీహెచ్ తో వర్మ చెడుగుడు..

వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై పడ్డారు. వీహెచ్ *అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ ను చించడం వివాదాస్పదమైంది. దానిపై స్పందించిన వర్మ వీహెచ్ ను కడిగిపారేశాడు. వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో వీహెచ్ పై ఇలా రాసుకొచ్చాడు.. ‘అర్జున్ రెడ్డి పోస్టర్లు చింపిన హనుమంతరావు దుస్తులు చింపేయాలని హీరో విజయ్ దేవరకొండకు’ సూచించారు. అయితే హనుమంతరావును అలా న్యూడ్ గా చూస్తే జనం జడుసుకుంటారని.. వర్మ సెటైర్ వేశారు. ‘ఇక అర్జున్ రెడ్డి సినిమాలో ఓ అందమైన హీరోయిన్ .. హీరో విజయ్ కు లిప్ టు లిప్ ముద్దు ఇస్తే హనుమంతరావుకు ఎందుకంత ఈర్ష అని .. అంత అందమైన అమ్మాయి నీ జీవితంలో ఎప్పుడూ ముద్దుపెట్టుకోలేదని అలా చేశావా’ అని వీహెచ్ ను కడిగిపారేశాడు వర్మ. వర్మ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ పై చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

విజయ్ దేవరకొండ, శాలిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ రెడ్డి’ . ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా సినిమా ప్రమోషన్ ను చిత్రం యూనిట్ ఉధృతం చేసింది. హైదరాబాద్ లోని సిటీ బస్సులపై పోస్టర్లను అంటించారు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ కి హీరోయిన్ ముద్దు ఇచ్చే సీన్ ను ముద్రించారు. ఇది చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హైదరాబాద్ లో ఓ బస్సును ఆపేసి అర్జున్ రెడ్డి పోస్టర్ అసభ్యంగా ఉందంటూ చించడం కలకలం రేపింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. వీహెచ్ ను కడిగిపారేశాడు. సినిమా పోస్టర్ చించుతావా అంటూ ఫేస్ బుక్ లో ఫైర్ అయ్యారు.

To Top

Send this to a friend