రాంచరణ్ సంచలన నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి 70,80వ దశకంలో ఎన్నో హిట్ చిత్రాలు తీశాడు. అందులో ‘మంత్రిగారి వియ్యంకుడు’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా చిరంజీవి, హీరోయిన్ గా పూర్ణిమా, ఇంకా శుభలేక సుధాకర్, అల్లు రామలింగయ్యలు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఫేమస్ డైరెక్టర్ బాపు దర్శకుడు. ఆడియో పరంగా కూడా మంత్రిగారి వియ్యంకుడు సూపర్ హిట్..చక్కటి ఎంటర్ టైనర్ లాంటి ఈ సినిమాను ఇప్పటి సమాజానికి తగ్గట్టు మార్పులు చేసి సినిమాగా తీయాలని రాంచరణ్ డిసైడ్ అయినట్టు సమాచారం.

హీరోలకు ఇప్పుడు కథలు దొరకడమే బంగారమైంది.. దొరికిన కథలు కూడా బాగా తీయడంలో కొందరు విఫలమవుతున్నారు. అందుకే ఇప్పుడు హీరోలు రిక్స్ తీసుకోవడం లేదు. పక్క భాషల్లో హిట్ అయిన చిత్రాలను తీసుకొని సినిమాలు చేసి విజయం సాధిస్తున్నారు. ఇటీవలే రాంచరణ్ తమిళంలో గ్రాండ్ హిట్ అయిన మూవీని తెలుగులో ధ్రువ పేరుతో రీమేక్ చేసి ఘనవిజయం సాధించారు. ఇప్పుడు మరో రిమేక్ పై కన్నేశారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు తన నాన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని వివిధ పాటలను పలు సినిమాల్లో చరణ్ రీమిక్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమానే రీమిక్స్ చేయాలని డిసైడ్ అవ్వడం విశేషం..

To Top

Send this to a friend