సన్నీ స్ఫూర్తితో వర్మ షార్ట్ ఫిలిం అదుర్స్

సన్నీలియోన్.. సెక్స్ బాంబ్.. ఒకప్పుడు పోర్న్ సినిమాలు తీసి పొట్టపోసుకున్న ఈ సుందరి.. ఇప్పుడు మోతాదు మించిన రోమాన్స్ సీన్లతో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ అభిమానులను రంజింప చేస్తోంది. ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్న సన్నీ లియోన్ అంటే రాంగోపాల్ వర్మకు చాలా ఇష్టమట. అందుకే ఆమె స్ఫూర్తిగా ఓ షార్ట్ ఫిలింను రూపొందించాడు.

‘మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తీ హై’ అంటూ సన్నీలియోన్ స్ఫూర్తితో ఓ షార్ట్ ఫిలింను రాంగోపాల్ వర్మ తీసి యూట్యూబ్ లో విడుదల చేశాడు. ఇప్పటికే గన్స్ అండ్ థైస్ పేరుతో మొత్తం బూతు సినిమా తీసి సంచలనం సృష్టించిన వర్మ ఇప్పుడు ఏకంగా సన్నీలియోన్ ఉందంతంలో షార్ట్ ఫిలిం తీయడం విశేషం..

ఈ షార్ట్ ఫిలిం నేపథ్యంలోకి వెళ్తే.. ఓ టీనేజీ అమ్మాయి సన్నీలియోన్ స్ఫూర్తితో హీరోయిన్ గా మారతానని.. తన పేరంట్స్ తో గొడవ పడుతుంది. వద్దని తల్లిదండ్రులు ఆమె పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తారు. కానీ అమ్మాయి సన్నీలానే ప్రవర్తించడం.. చేయడం చేస్తుంటుంది. ఈ అంశాలన్నీ కళ్లకు కట్టినట్టు వర్మ షార్ట్ ఫిలింలో చూపించాడు.

వర్మ తీసిన ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది. ‘మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తీ హై’ షార్ట్ ఫిలింను కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend