‘ఎన్టీఆర్’ సినిమాకు వర్మ దర్శకుడు కాదు..

రాంగోపాల్ వర్మ ఆనందం ఒక్కరోజుకే మాయమైంది. ఎన్టీఆర్ బయోపిక్ ను తాను తీస్తున్నానని వర్మ ప్రకటించిన మరుసటి రోజే హీరో బాలయ్య అల్లుడు, మంత్రి లోకేష్ వర్మకు షాక్ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడిన లోకేష్ ఎన్టీఆర్ బయోపిక్ కు డైరెక్టర్ వర్మ కాదని.. ఇంకా దర్శకుడిని కన్ఫమ్ చేయలేదని లోకేష్ తేల్చిచెప్పాడు. మామ బాలక్రిష్ణ బర్త్ డే వేడుకలు కొద్దిరోజుల క్రితం పోర్చుగల్ లో ఘనంగా జరిగాయి. ఈ బర్త్ డేలో పాల్గొన్న లోకేష్ ఎన్టీఆర్ బయోపిక్ పై బాలయ్యతో చర్చించాడట. కథ, కథనం ఎలా ఉండాలనేది డిసైడ్ చేశారట. అయితే ఎన్టీఆర్ బయోపిక్ పై దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని లోకేష్ మీడియాతో తెలిపారు. మీడియా ప్రతినిధులు వర్మ ఎన్టీఆర్ బయోపిక్ పై సినిమా చేస్తానన్నారని.. లోకేష్ ను ప్రశ్నించగా.. డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని.. మామ బాలక్రిష్ణ డైరెక్టర్ ను నిర్ణయించి అనౌన్స్ చేస్తాడని లోకేష్ తెలిపారు. ఈ ప్రకటనతో వర్మ ఆశలు గల్లంతయ్యాయి.

ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్టు వర్మ నిన్న ఆర్భాటంగా ప్రకటించారు. తన వాయిస్ ఓవర్ తో కూడిన వీడియోను సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. ఓ పాటను ఎన్టీఆర్ పై విడుదల చేశాడు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి , ఎవరికీ తెలియని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని వర్మ ప్రకటించారు. ఎన్టీఆర్ పై జరిగిన కుట్రల వెనుకున్న అసలు వ్యక్తులెవరో తెరపై చూపిస్తానని తెలిపారు.

వర్మ ఈ సినిమాలో చంద్రబాబును విలన్ గా చూపిస్తాడా.. లేదా లక్ష్మీపార్వతినా అన్నది ఉత్కంఠ రేపింది. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ స్పందించి అసలు ఎన్టీఆర్ బయోపిక్ కు వర్మ దర్శకుడు కాదని తేల్చిచెప్పాడు. మరి వర్మ ఎవరితో ఈ సినిమా చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. బాలయ్య కాకుండా ఎవరితో వర్మ సినిమా చేస్తాడు అన్నది మీమాంసగా మారింది.

To Top

Send this to a friend