అల్లు అర్జున్, రాంచరణ్ లను మించి బెస్ట్ డ్యాన్సర్..

నేటి తరం కుర్ర హీరోలు కూడా బాగానే డ్యాన్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో డ్యాన్స్ కు పర్యాయపదంగా బాగా డ్యాన్స్ చేసేది అల్లు అర్జున్. ఆ తర్వాత రాంచరణ్ లు.. అయితే ఈ ఇద్దరి కంటే కూడా మరో అద్భుత డ్యాన్సర్ తెలుగులో ఉంటాడని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆయనతో డ్యాన్స్ చేయడం కష్టమంటోంది. బన్నీ, రాంచరణ్ లు డ్యాన్స్ లో టేక్ లు తీసుకుంటారని.. కానీ ఎన్టీఆర్ డ్యాన్స్ మాస్టర్ ఇలా చెప్పగానే టేక్ కు రెడీ అంటాడని.. కానీ హీరోయిన్ గా తనకు ఎన్టీఆర్ ను అందుకోవడం కష్టమని పేర్కొంది.

ఎన్టీఆర్ తో కలిసి నటించిన సినిమాలో ముందే తనకు డ్యాన్స్ స్టెప్పులు నేర్పాలని సెట్ లో డ్యాన్స్ మాస్టర్ ను తాను కోరేదానిని అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పేదట.. ఇలా అల్లు అర్జున్, రాంచరణ్ లను మించి తన దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆరే అంటోంది ఈ భామ..

మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అద్భుతమైన డ్యాన్స్ , స్టెప్పులతోనే ఇండస్ట్రీని ఆకర్సించాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాలో చిరు వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఫేమస్. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన ‘వీణ’ స్టెప్ ఎంత పెద్ద హిట్లో తెలిసిందే.. ఇప్పటికీ చిరంజీవి ఏజ్ లో ఉన్న కమల్ హాసన్, రజినీకాంత్ లు చిరులా స్టెప్పులు వేయలేరు. అంతలా ఇమేజ్ సంపాదించుకున్నారు చిరంజీవి. చిరంజీవిని మినహాయిస్తే నేటి తరం హీరోల్లో ఇప్పుడు ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు తొలి రెండు స్థానాల్లో ఉంటారు..

To Top

Send this to a friend