ఎన్టీఆర్ కోసం మరో టాప్ హీరోయిన్..

పెద్ద హీరోల చిత్రాల్లో సెక్సీ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్ లాంటి ఐటమ్ గాళ్ లను కోట్లు పోసి ఐటం సాంగ్ లలో ఆడిస్తున్నారు.. చిన్న హీరోలు లోకల్ గా ఉండే హీరోయిన్లు, ఐటంబాంబులను పెట్టి కానిచ్చేస్తున్నారు.. ఐటం సాంగ్ లుంటేనే ఇప్పుడు సినిమాలు ఆడుతున్నాయి. ఈ ఐటం సాంగ్ లు చేయడానికి ఇప్పుడు టాప్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపిస్తుండడం విశేషం.. కాజల్, సమంత, తమన్నాలు కూడా ఐటం గాళ్ గా మారి బాగా సంపాదించేస్తున్నారు. ఇటీవల టాప్ హీరోయిన్ కాజల్ .. ఎన్టీఆర్ సినిమా జనతాగ్యారేజ్ కోసం ఐటం సాంగ్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.

ఇప్పుడు తాజా గా ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం ఓ మాంచి ఐటం సాంగ్ ను రెడీ చేశారట.. ఈ పాట కోసం ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారట చిత్రం యూనిటి్.. ఆమె సరేననడంతో ఇప్పుడు ఎన్టీఆర్ సరసన మరో అగ్ర హీరోయిన్ ఐటంసాంగ్ లో నర్తించబోతుండడం విశేషంగా మారింది.

జనతాగ్యారేజ్ లో ‘పక్కా లోకల్ ’ సాంగ్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టిన కాజల్ కు ఎంత పేరొచ్చిందో తెలిసిందే.. ఇప్పుడు జై లవ కువలో రకుల్ ప్రీత్ కూడా ఎన్టీఆర్ తో ఆడిపాడి అంతే పేరు సంపాదించుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.. జైలవకుశ సినిమాకు రకుల్ చేసే ఐటం సాంగ్ పెద్ద హైలెట్ అవుతుందని చిత్రం యూనిట్ భావిస్తోంది.

To Top

Send this to a friend