అప్పుడు చరణ్‌కు, ఇప్పుడు బాలయ్యకు..!

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆయన స్టార్‌ హీరోల స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి వేరు. గత కొన్ని సంవత్సరాలుగా మినిమం సక్సెస్‌ను కూడా రాజశేఖర్‌ దక్కించుకోలేక పోయారు. దాంతో రెండు సంవత్సరాల పాటు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు గరుడ వేగ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

‘గరుడ వేగ’ చిత్రంతో పాటు రాజశేఖర్‌కు పలు చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నాయి. విలన్‌గా రాజశేఖర్‌ను తీసుకు రావాలని పలువురు భావించారు. అయితే రాజశేఖర్‌ మాత్రం విలన్‌ వేషాలు వేసేందుకు ఇంకా సిద్దపడటం లేదు. ఆ మద్య రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ చిత్రంలో విలన్‌ పాత్ర కోసం రాజశేఖర్‌ను సంప్రదించడం జరిగింది. రాజశేఖర్‌ నో చెప్పడంతో ఆ పాత్రకు అరవింద్‌ స్వామిని కాస్త ఎక్కువ మొత్తం ఇచ్చి ఒప్పించారు.

‘ధృవ’ చిత్రం తర్వాత మళ్లీ బాలయ్య సినిమాకు కూడా రాజశేఖర్‌ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ 102వ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏయస్‌ రవికుమార్‌ తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో విలన్‌ పాత్ర కోసం రాజశేఖర్‌ను సంప్రదించడం జరిగింది. అయితే రాజశేఖర్‌ ఒప్పుకోక పోవడంతో ఆ పాత్రను శ్రీకాంత్‌తో చేయిస్తున్నారు.

To Top

Send this to a friend